ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బఠాణి ఎంతో రుచికరమైన పదార్ధం.. బఠాణి తో మంచి రుచికరమైన వంటలు ఎన్నో చేసుకోవచ్చు. ఇక రుచికరమైన బఠాణి కట్ లెట్స్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...
పచ్చి బఠాణి కట్ లెట్స్ తయారు చేయు విధానానికి కావాల్సిన పదార్ధాలు....
సగ్గు బియ్యం – ఒక కప్పు; పచ్చి బఠాణీలు – అర కప్పు; బొంబాయి రవ్వ – ఒక కప్పు; జీలకర్ర – పావు టీ స్పూను; సోడా – చిటికెడు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి ముద్ద– తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; నూనె – తగినంత; ఉప్పు – తగినంత; ఉడికించిన బంగాళదుంప ముద్ద – అర కప్పు; కొత్తిమీర – తగినంత
పచ్చి బఠాణి కట్ లెట్స్ తయారు చేయు విధానం తెలుసుకోండి......
ముందుగా సగ్గు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి, నీరంతా ఒంపేసి, సగ్గు బియ్యం మునిగేవరకు మంచి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు వడబోయాలి. బఠాణీలను తగినిన్న నీళ్లలో గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం ఇంకా బఠాణీ ముద్ద, బంగాళదుంప ముద్ద వేసి బాగా కలిపి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలపాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, తడి వస్త్రం మీద ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్‌లెట్ సైజులో ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి బాగా కాలాక, తీసేసి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి