సమాజంలో రోజురోజుకు హత్యలు అత్యాచార ఘటనలు త్రీ పోతున్నాయి. కనీసం సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమలు లేకుండా పోతున్నాయి. చిన్న చిన్న తప్పుల కే పెద్ద పెద్ద మర్డర్ల వరకు  వెళు తున్నారు. నా అన్న వారు నన్ను మరిచి నమ్మకద్రోహం చేస్తున్నారు. అలాంటి ఒక కుటుంబ కలహాలతో ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసింది. కళ్ళల్లో కారం కొట్టి మరి కుటుంబ సభ్యులను కత్తులతో దాడి చేసిన ఘటన  ఎక్కడో జరిగిందో తెలుసు కుందామా..?
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తరపు బంధువులు భర్త కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో భర్త తల్లి మృతి చెందింది. తండ్రి, అమ్మమ్మ కు తీవ్ర గాయా లయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడ్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన కమతం బిక్షమయ్య, అచ్చమ్మల  కుమారుడు శివ నారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోద ల కూతురికి ఇచ్చి ఐదు సంవత్సరాల కిందట వివాహం జరిపించారు.

సంవత్సరం పాటు ఆనందంగా ఉన్న వీరి మధ్య అనుకోకుండా మనస్పర్ధలు  పెరిగాయి. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టి ఇద్దరికీ అనేకసార్లు నచ్చజెప్పారు. అయినా కూడా గొడవలు ఆగలేదు. ఈ క్రమంలో సూర్య నారాయణ, యశోద అల్లుడి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో శ్యామల తల్లిదండ్రులు, సోదరుడు శివ కలిసి శివ నారాయణ ఇంట్లోకి చొరబడ్డారు.

అల్లుడు శివ నారాయణ,ఆయన తల్లి అచ్చమ్మ, తండ్రి బిక్షమయ్య,అమ్మమ్మ నారమ్మ కళ్లల్లోకి కారం చల్లి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. శివ నారాయణ,భిక్షమ్మయ్య, నారమ్మ  కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: