ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ప్రపంచాన్ని మొత్తం చుట్టేయొచ్చు అన్న విధంగా ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు  అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి వెన్నులో వెనుక పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా చూస్తూ చూస్తుండగానే సముద్రంలో ఈదుతున్న  ఒక వ్యక్తిని షార్క్ అమాంతం మింగేసింది. ఈ ఘటన ఈజిప్ట్ లోని ఎర్ర సముద్రంలో జరిగింది అన్నది తెలుస్తుంది. రష్యాకు చెందిన 23 ఏళ్ల పోపోన్ అనే వ్యక్తిని షార్క్ తనకు ఆహారంగా మార్చుకుంది.. ఎర్ర సముద్రాన్ని సందర్శించాలనుకున్నారు పోపోన్ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే ఆ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన యాత్రలో భాగంగా ఎర్ర సముద్రంలోని ఒక రిసార్ట్ లో బస చేశారు. ఇక తన ప్రియురాలితో కలిసి పోపోన్ తీరంలో ఈతకు వెళ్ళాడు. అయితే ఇంతలో అక్కడికి వచ్చిన టైగర్ షార్క్ అతనిపై దారుణంగా దాడి చేసింది. అయితే ఇక షార్క్ నుంచి కాపాడాలి అంటూ అతను ఎంతగానో కేకలు వేశాడు. తీరానికి చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే దూసుకు వచ్చిన టైగర్ షార్క్ అతని అమాంతం మింగేసింది. అందరూ చూస్తుండగానే ఇక అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ కూడా నిర్కాంత పోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: