
ఆయన అరెస్టు అయిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా బెయిలు వస్తుందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటికి వచ్చేస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు అనుకున్నారు. ఆయన కేసు ఇప్పుడు కోర్టులో వాదోపవాదాల మధ్య నలుగుతుంది. అయితే జగన్ కి సంబంధించిన లాయర్ పొన్నాల సుధాకర్ రెడ్డికి ఎప్పుడు ఓటమి అనుభవాలే ఎదురవుతూ వచ్చాయి మొన్నటి వరకు. అయితే తాజాగా ఆయన అదృష్టం మారిందని తెలుస్తుంది.
కోట్లలో జీతాలు తీసుకునే లాయర్ల ముందు లక్షల్లో జీతాలు తీసుకునే లాయర్ గెలుపొందటమే ఇక్కడ గొప్పగా చెప్పుకోదగ్గ అంశం. మొన్న సిద్ధార్థ లోగ్రాని ఓడించడం ఒక హైలెట్ అయితే ఇప్పుడు హరీష్ సాల్వన్ ని కూడా ఓడించడం జరిగింది ఆయన. కానీ ఈసారి ఆయనకు ఇద్దరు తోడు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి రంజిత్ కుమార్ అయితే రెండో వ్యక్తి ముకుల్ అని తెలుస్తుంది. అయితే ఈ వాదనల్లో కీలకమైన పాయింట్స్ మాత్రం పొన్నాల సుధాకర్ రెడ్డి వాదించారని అంటున్నారు.
17 ఏ గురించి కొన్ని జడ్జిమెంట్స్, ఇంటర్ పిటిషన్స్ పక్క వాళ్ళు చెప్పారు. కానీ అసలైన పాయింట్లను చెప్పింది మాత్రం పొన్నాల సుధాకర్ రెడ్డి అని తెలుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఆయన పాత్ర లేదన్నట్లుగా లూధ్రా వాళ్లు వాదించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని సిఐడి ఇచ్చిన నివేదికను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ అయింది మాత్రం పొన్నాల సుధాకర్ రెడ్డినే అని అంటున్నారు తెలిసిన వాళ్ళు.