మొన్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు చాలా మంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అని చెప్పాలి. అయితే నిజంగానే జగన్ మోహన్ రెడ్డి కావాలనే చంద్రబాబు నాయుడుని ఒక పధకం ప్రకారం అరెస్ట్ చేయించారా అంటే అవుననే బలంగా అంటున్నాయి చాలా వర్గాలు.


జగన్ మోహన్ రెడ్డి గతంలో తనకు జరిగిన దానికి ప్రతీకారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఈ విధంగా చేసుకు వస్తున్నారా అని అనుమానపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో జగన్ మోహన్ రెడ్డిని కావాలని జైలుకు వెళ్లేలా చేయడంలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రధాన పాత్ర పోషించాయని అంటున్నారు కొంత మంది. ఈ విషయం పై జగన్ తెలుగుదేశం పార్టీ పై దాడి చేస్తున్నాడా, లేదంటే తనపై అప్పుడు జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడా అంటే ఇప్పుడు రెండవదే జరుగుతుందని అంటున్నారు.


ఎందుకంటే అసలు జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని ఇప్పటికీ తప్పుగానే చూపిస్తూ ఉంటారు అవతలి వాళ్ళు. తనని మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇలానే క్యారెక్టర్  ఎసాసినేషన్ చేస్తారు, చేస్తున్నారు ఇప్పటికి కూడా. రాజకీయ పరంగా తాము ప్రజలకు ఏం చేస్తున్నామనే విషయాన్ని ప్రక్కన పెట్టి కేవలం పక్క వారిని తప్పుగా చూపించడం అనే విషయం పైనే టీడీపీ వాళ్లు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.


వాళ్ళకు పని అయ్యేంత వరకూ ఒకలా, తర్వాత ఒకలా ఉంటారు. ప్రజలు తమకు ఓటు వేయాలంటే తాము చేసిన మంచి పనులను చెప్పడం మానేసి ఎదుటి వారి గురించి తమకున్న అభిప్రాయాలను ప్రజల మీద  రుద్దడం చేస్తారు. వైయస్సార్ వాళ్ళను సైకోలు అంటూ విమర్శించే వాళ్ళు తమ వల్లే వాళ్ళు అలా మారిపోయారని అర్థం చేసుకోవడం లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: