మణిపుర్ ప్రత్యేక దేశం కావాలి. ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి  వాటికో దేశం.. పంజాబ్, కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలి.. అని నానాటికీ ఈ వాదన ఎక్కువవుతోంది. జనాగ్రహం పెల్లుబిక్కుతోంది.  వీరికి సోషల్ మీడియాలో ఓ వర్గం మద్దతు తెలుపుతుంది. ఇది చైనా ప్రేమిక వర్గం.. భారత వ్యతిరేక వర్గం. వీరంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు.


పాక్ ఆక్రమిత కశ్మీర్.  పాకిస్తాన్ దృష్టిలో స్వతంత్ర కశ్మీర్. భారతదేశం దృష్టిలో భారత భూభాగాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన పీవోకే. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉద్యమాలు పెరుగుతున్నాయి.  మేం వచ్చి భారత్ లో కలుస్తామంటూ.. ఇక్కడ చేస్తున్న ఉద్యమాలు ముజఫరాబాద్ వరకు వ్యాపించాయి. ఇక్కడ గతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అవి ధరల పెరుగుదల, బిల్లులు చెల్లింపులు వంటి అంశాల గురించి పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటాలు జరిగేవి.


అయితే ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వెంటన్ పాకిస్తాన్ తమ ప్రాంతాన్ని ఖాళీ చేసి శాంతియుత జీవితం గడిపేందుకు అవకాశం కల్పించాలని నినాదాలు చేస్తున్నారు.  పీవోకేలో పాక్ గూఢాచార సంస్థలు తిరుగుతూ ప్రజలను వేధిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. పాక్ విధానాల వల్ల పర్యవరణం దెబ్బతింటోందని చెప్తున్నారు.


మరోవైపు బలూచిస్తాన్ లో కూడా పాక్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. వీరిని పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. పీవోకేలో ఎప్పుడూ లేనంతగా ఆందోళనలు మిన్నంటాయి. పుష్కలంగా ఇక్కడ ఉన్న వనరులను పాక్ దోచుకుంటోందని.. కనీసం తమకు బతికే అవకాశం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ భారత్ నుంచి విడిపోవాలని కొన్ని రాష్ట్రాలు చూస్తుంటే మన నుంచి విడిపోయిన పీవోకే భారత్ లో కలుస్తామని ఆందోళనలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

pok