
అయితే రష్యా విషయంలో అమెరికా, యూరప్ దేశాల్లోని నిపుణులైన సైనికులు చాకచక్యంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారు. వీరు రోజూ దాడులు చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం.. ఎటాక్ చేసి పుతిన్ సైన్యాన్ని చావు దెబ్బకొడుతున్నారు. ఇలా దాడులు చేయడం వల్ల సెవన్త్ పోల్ సిటీ వద్ద చేసిన దాడిలో ఒక సీనియర్ ఆర్మీ సైనికుడు చనిపోయాడు. బీభత్సమైన దాడులతో విరుచుకుపడి ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ చెబుతుంది
అయితే ఉక్రెయిన్ కు అంతా సీన్ లేదు. అమెరికా తన శాటిలైట్ల ద్వారా తాను ఎక్కడ దాడి చేసిందో తెలుసుకుంటుంది. ఎంత నష్టం జరిగింది. దాదాపు ఎంతమంది చనిపోయారు. ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయి అనే వివరాలను రష్యా కు చెందిన వివిధ టెక్నికల్ రాడార్లను జామ్ చేసి మరీ అమెరికా తెలుసుకుంటుంది. ఇందులో భాగంగానే సెవెన్త్ పోల్ సిటీలో చేసిన దాడిలో సీనియర్ రష్యా ఆర్మీ అధికారితో పాటు దాదాపు 33 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
అయితే ఇదంతా అమెరికా చేసిన పనేనని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రాబోయే రోజుల్లో రష్యా అణ్వస్త్ర యుద్ధానికి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. యుద్ధాన్ని మాన్పించాల్సింది పోయి మరింత ముందుకు తీసుకెళుతున్నారు. దీని వల్ల ప్రపంచ దేశాల్లో విపరీతమైన ధరల పెరుగుదల ఉంది. దీంతో అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యుద్ధానికి ముగింపు పలికి శాంతి నెలకొల్పాలని వివిధ దేశాలు కోరుతున్నాయి.