
ఇది అత్యంత భయంకరమైన పేలుడు అని అంటున్నారు. నక్షత్రాలు కూడా పేలిపోతాయని చెబుతున్నారు. జపాన్ కు చెందిన సైంటిస్టు కోయిజ ఎటిగ ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. భూమికి 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వీల్ గెలాక్సీలో ఒక నక్షత్రం తనకు తానుగా పేలిపోయిందని తెలిపారు. అది ప్రస్తుతం ఉన్న సూర్యుడు కంటే ఎనిమిది రేట్లు పెద్దదని చెబుతున్నారు. పింగ్ వీల్ గెలాక్సీ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
అయితే సూపర్ నోవాలతో పోల్చితే ఈ పేలిపోయిన నక్షత్రం భూమికి అత్యంత సమీపంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భూమి పైన ఉన్న సైంటిస్టులకు తెలిసిన అత్యంత సూపర్ నోవా కూడా ఇదేనని వెల్లడించారు. ఈ పేలిపోయిన నక్షత్రం నెంబర్ ను ఎస్ ఎన్ 2023 అని నామకరణం చేశారు. ఇది సూర్యుడి కంటే ఎనిమిది నుంచి దాదాపు 25 రేట్లు పెద్దదని చెబుతున్నారు. ఇవి రెడ్ సూపర్ జాయింట్లుగా మారి పేలిపోతున్నట్లు చెప్పారు. తమ బరువును తామే తాళలేక భారీ పేలుళ్లకు కారణమవుతున్నాయని, ఇవి పేలిపోక ముందు అతి దట్టమైన ద్రవ్యరాశితో ఉందని తెలిపారు.
ఇలాంటి సూపర్ నోవాలు సంభవించిన తర్వాత అతి ఎక్కువ అత్యంత ప్రకాశవంతమైన కాంతి పుంజలు వెలువడతాయని పేర్కొన్నారు. అయితే ఇవి చివరి వరకు చేరుకోలేవని తెలిపారు. అయితే భారీ నక్షత్రాల పుట్టక, ఆవిర్భావం, పెరుగుదల, ఉత్పాతం చివరకు విధ్వంసం దాకా ఎన్నో విషయాలు ఈ నక్షత్రం నుంచి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం మీద విశ్వం అతి విశాలమైనదని మరోసారి జపాన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.