
ఈ మేరకు సర్వేలో మరిన్ని అంశాలు.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 318 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా కూటమికి 175 సీట్లు, ఇతరులకు 50 స్థానాలు వస్తాయని లోక్ సభ ఎన్నికల పోల్లో ఇండియా టీవీ సీఎన్ ఎక్స్ లెక్కగట్టింది. అంతేకాకుండా బీజేపీకి సొంతంగా 290, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 66, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకేకు 22, వైసీపీకి 18, బీజేడీ కి 13, ఆప్ కు 10, బీఆర్ఎస్ కి 8, లెఫ్ట్ పార్టీలకు 8, ఆర్జేడీ, జేడీయూ, టీడీపీలకు 7 స్థానాలు, సమాజ్ వాదీ పార్టీకి 4, డీఎంకేకి 7, చీలిన ఎన్సీపీకి 4, శివసేనకు 2 వస్తాయని అంచనా వేసింది. అదే సందర్భంలో ఉద్ధవ్ కు సంబంధించిన శివసేనకు 6స్థానాలు గెలుచుకుంటుందని తమ సర్వేలో వెల్లడించింది.
ఓట్ల శాతానికి వస్తే ట్రైబల్స్ లో కాంగ్రెస్ కు 42 శాతం, ఫార్వార్డ్ కులాల్లో బీజేపీకి 52.6 శాతం కాంగ్రెస్ కు 35.6 శాతం, ఓబీసీల్లో బీజేపీకి 48.3, కాంగ్రెస్ కు 44.4 శాతం, ఎస్సీల్లో చూసుకుంటే అధికార బీజేపీకి 46.8 శాతం, ప్రతిపక్షానికి 39.6 శాతం, మహిళల్లో బీజేపీకి 47.2, కాంగ్రెస్ కు 44.3 శాతం, పురుషుల్లో బీజేపీకి 42.5 ,కాంగ్రెస్ కు 46.5 శాతం ఓట్లు పొందనున్నాయి. చూద్దాం ఈ లెక్కలు ఏమైనా తారుమారు అవుతాయా లేదా మోదీనే గద్దెను ఎక్కుతారా అంటే వేచి చూడాల్సిందే.