తెలంగాణ ఎన్నికల ఫలితాలలో భాజపా ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది. దాదాపు 14శాతం ఓటు బ్యాంకును ఆ పార్టీ కైవసం చేసుకుంది. అంటే.. గత శాసన సభ ఎన్నికలతో పోలిస్తే వంద శాతం ఓటింగ్ శాతం పెరిగిందన్న మాట.. అంతే కాదు.. గతంలో కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మరో 7 స్థానాలు గెలుచుకుంది. అంటే సాధారణంగా ఇది చాలా ఎక్కువ అభివృద్ధి గానే కనిపిస్తోంది.


అంతే కాదు.. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ భాజపాగా చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే.. బీజేపీ అంతకుమించి విజయాలు అందుకుని ఉండేది. భారాస సర్కారు వైఫల్యాలపై బీజేపీ అనేక పోరాటాలు చేసినప్పటికీ అందుకు తగిన ఫలితాలు మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి.


కాంగ్రెస్, భారాస పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని.. అందుకే బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని.. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో భాజపాకు మంచి మెజార్టీ ఇచ్చి భాజపాకు అధికారం కట్టబెట్టారని సర్ది చెప్పుకుంటున్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీ ఇవ్వలేదని.. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో తాము అధికారంలోకి వచ్చామని.. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని కాపాడుకున్నామని.. వారు సంతృప్తి పడుతున్నారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకే మా ఓటు వేస్తామనే సంకేతాన్ని ఇచ్చారని.. నిరాశను దరిచేరనీయకుండా పట్టుదలతో మా లక్ష్యం కోసం ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భాజపా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని.. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తామని.. వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తాని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP