ఒక పని ఒకరు చేస్తే ఒకలా, మరొకరు చేస్తే మరొకలా వార్తలు వ్రాయడం ఇప్పుడు రివాజు అయిపోయింది. ఒకరు చేస్తే కరెక్టు, మరొకరు చేస్తే తప్పు అన్నట్లుగా ప్రాజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో ఉన్న ప్రజా వేదికను కూల్చడం జరిగింది. దాంతో కొందరు జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టాడని విమర్శించడం కూడా జరిగింది.


సరే జగన్మోహన్ రెడ్డి కూల్చివేతతో తన పరిపాలన మొదలుపెట్టాడు అని అన్నారు అప్పుడు బాగానే ఉంది. కానీ తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం కన్నా ముందే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్  గెలవగానే ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి ఆయన చెప్పినట్లుగానే  ప్రగతి భవన్‌ కు ముందు రక్షణ వలయంగా ఏర్పాటు చేసిన గ్రిల్స్‌‌ను తొలగించడం జరిగింది.


అయితే రేవంత్ రెడ్డి చేయించిన ఈ పనిని మాత్రం కొంతమంది మెచ్చుకుంటున్నారు అని తెలుస్తుంది. ప్రజలు ప్రగతి భవన్ లోకి రావడానికి ఆయన ఈ విధంగా చేశారు అని మెచ్చుకుంటున్నారట. అయితే జగన్ తాను అధికారంలోకి వచ్చాక కూల్చి వేయించిన ప్రజా వేదిక కూడా ఒక అక్రమ కట్టడమే అని అంటారు కొంతమంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించిన పని కరెక్ట్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించిన పని కూడా కరెక్టే కదా అని అడుగుతున్నారు కొంతమంది.


అంతేకాకుండా జగన్ చంద్రబాబు చేసిన అవినీతిపై కమిటీ వేసి ఆయన్ని అరెస్టు చేయించాడు.  అయితే దాన్ని ప్రతిపక్షాలపై కుట్ర అంటూ చెప్పుకొస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు కదా. మరి ఎవరు చేసింది కరెక్టు, ఎవరు చేసింది రాంగ్ అని అడుగుతున్నారు సాధారణ జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: