మనది ప్రజాస్వామ్య భారతం.. మన దేశంలో మెజారిటీ జనం చెప్పిందే న్యాయం.. మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న వాడే నాయకుడు.. చదవడానికి బాగానే ఉంది. కానీ నిజంగా మెజారిటీ జనం ఎన్నుకున్న నాయకులు వస్తున్నారా.. లేదు.. అలా ఎందుకు లేదో చెప్పే ఓ తమాషా కథ ఇది. సోషల్ మీడియాలో బాగా తిరుగుతోందీ కథ. మీరు చదవంటి..

100 మంది ఉండే ఒక హాస్టల్ లో రోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డిస్తున్నారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా వేరే టిఫిన్ ను పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేస్తున్నారు. మిగతా 20 మంది మాత్రం ఉప్మాకు ఎప్పుడైనా రెడీ అనేవారు. మిగిలిన 80 మంది మాత్రం ఉప్మా కాకుండా వేరే టిఫిన్ వండి పెట్టాల్సిందిగా కోరేవారు.

ఈ సమస్యకు పరిష్కారంగా హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించాడు. ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండిపెడతానన్నారు. అప్పుడు ఓటింగ్ పెట్టారు. ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు ఓటును ఖచ్చితంగా ఉప్మాకే వేశారు. వేరే టిఫిన్ కోరుకున్న మిగతా 80 మంది మాత్రం ఇలా ఓటేశారు.

18 మంది మసాలా దోసా
16 మంది ఆలూ పరోటా & దహి
14 మంది రోటి & సబ్జి
12 మంది బ్రెడ్ & బట్టర్
10 మంది నూడుల్స్
10 మంది ఇడ్లీ సాంబార్

ఓటింగ్ ముగిశాక.. ఫలితాల ప్రకారం, ఉప్మాకే అత్యధికంగా 20  ఓట్లు పడటం వల్ల మళ్లీ అక్కడ ప్రతి రోజు ఉప్మాయే పెడుతున్నారు. ఇదీ మన ప్రజాస్వామ్య నమూనా.. 80% జనాభా స్వార్ధంతో విభజించ బడి, చెల్లా చెదురై దిక్కులు చూస్తోంది. అందుకే 20% ఉన్నవాళ్లు మనల్ని పాలిస్తున్నారు.
ఇదో చక్కటి ఉదాహరణ అర్ధం చేసుకుంటే.. ఏమంటారు.?


మరింత సమాచారం తెలుసుకోండి: