ఎన్నికల సమయంలో కొన్ని నినాదాలు బాగా పేల్తాయి.. అవి ఆ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతాయి. పార్టీ క్యాడర్‌కు తారక మంత్రాలవుతాయి. ప్రజాభిప్రాయాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ఇలాంటి తారక మంత్రాలు నాలుగైదు వదిలారు. అవి బ్రహ్మాండంగా పని చేశాయి.  రావాలి జగన్.. కావాలి జగన్.. అంటూ వైసీపీ చేసిన ప్రచారం.. వైసీపీకి చాలా బూస్టప్ ఇచ్చింది. అప్పట్లో ఆ నినాదం ఓ హోరుగా మారింది. అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రస్తావించిన ఒక్క ఛాన్స్ నినాదం కూడా బాగా పేలింది.


అందుకే జనం జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. టీడీపీ కూడా ఇలాంటి ప్రయోగాలు చేసింది. 2014 ఎన్నికలకు ముందు బాబు రావాలి.. జాబు రావాలి అంటూ క్యాంపెయిన్ నడిపింది. ఇక ప్రస్తుత విషాయానికి వస్తే.. టీడీపీ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేసిందా అన్నట్టుగా ఉంది రాజకీయ వాతావరణం. తాజాగా చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ ఓ క్యాంపెయిన్ ప్రారంభించారు. జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. ఈ జిల్లాల పర్యటనలో తాజాగా చంద్రబాబు మరో కొత్త స్లోగన్ ప్రారంభించారు.


అదే క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. గతంలో బ్రిటిష్ వారిని ఉద్దేశించి చేసిన నినాదం క్విట్ ఇండియా.. అంటూ బ్రిటీష్ వారిని ఇండియా వదలి వెళ్లండి అంటూ నిలదీయడం.. ఇప్పుడు మరి క్విట్ జగన్ అని నినదించడం ద్వారా ఎవరిని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను వదిలేయండి అంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారా.. ఏమో ఆ టీడీపీ నేతలకే తెలియాలి. తాజా జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ నినాదం బాగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.


అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత సజ్జల మాత్రం.. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు ప్రజలు నమ్మడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్ కే ఉన్నాయన్నారు.  పన్నులన్నీ చంద్రబాబు వారసత్వంగా ఇచ్చిపోయివేనని, తాము  కొత్తగా వేసిన పన్నులను ప్రజలకు  వివరించి అమలు చేస్తున్నామని సజ్జల అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: