జీ-20 సమ్మిట్ కు రాబోయే మరో నాలుగు నెలల్లో భారతదేశం ఆతిథ్యాన్ని ఇవ్వబోతుంది. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 దేశాల నుండి వైద్య నిపుణులు ఇంకా ఐటీ నిపుణులు, ఇంకా అనేకమంది ప్రతిభావంతులు ఆంధ్రప్రదేశ్  కు రాబోతున్నారు. దీనికి విశాఖపట్నం వేదిక గా వైభవంగా జరగబోతుంది. దానికి కావలసిన ఏర్పాట్లు కూడా విశాఖపట్నంలో చురుకుగా జరిగిపోతున్నాయి.ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 6 నుండి 8 వరకు  గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్  జరగబోతోంది. ఈ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు అందరూ రాబోతున్నారు.


జనవరి 20 నుండి 21 వరకు ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్  జరుగుతుంది. ఇక్కడ దీనికోసం ఐటీ నిపుణులు అందరూ సమావేశం కాబోతున్నారు. ఐటిఏఏపీ ద్వారా నిర్వహించబడే ఈ సమావేశానికి ఎస్.టీ.పీ.ఐ, ఐటీఈ&సీ , ఏపీఐఎస్ ఇన్ఫినిటీ- వైజాగ్  ఇంకా ఏ.పీ ప్రభుత్వం  సహఆతిథ్యాన్ని అందించబోతుండటం విశేషం. ఈ ఐటీ సమ్మిట్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులు, పరిశోధకులు, కన్సల్టెంట్లు, విద్యావేత్తలు, నిపుణులు ఇంకా  ఇతర వాటాదారులు ఒకచోట కలిసే అవకాశం ఉంది.  


ఫిబ్రవరి 3 - 4 తేదీలలో  జీ-20 సమావేశాలు నిర్వహిస్తారు. 2023  ఫిబ్రవరి 3 , 4 న వైజాగ్‌లో, వ్యవసాయం, విద్య, ఆర్థికరంగం, పర్యావరణం ఇంకా ఆరోగ్యంపై 37 సెమినార్లు   భారీ ఎత్తున  నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16 - 17 తేదీల్లో గ్లోబల్ టెక్ సమ్మిట్  ఉంటుంది. ఇది మరో కీలకమైన కార్యక్రమం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు మరియు ఐటీ సంస్థల యజమానులు అందరూ రాబోతున్నారు.


మార్చి 3-4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తారు.  ఈ సమావేశానికి అనేకమంది పెట్టుబడుదారులు వచ్చి అక్కడ పరిస్థితులను చూసి పెట్టుబడులు  పెట్టబోతున్నారు. ఏప్రిల్ 24వ తేదీన తిరిగి జీ-20 సమావేశాలు జరుగుతాయి. దీనిలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85% ఆదాయం కలిగిన 190 దేశాల యొక్క వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

g20