వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. దీనికి కారణం వైఎస్ చనిపోయాక చాలా మంది గుండెపోటుతో ఆయన అభిమానులు చనిపోయారని ఆయా కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ భావించారు. అయితే దీనికి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ ఒప్పు కోలేదు.


దీంతో కాంగ్రెస్ ను వీడి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. గ్రామ గ్రామాన వెళ్లి వైఎస్ చనిపోయిన తర్వాత తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను ఓదార్చారు. అయితే దీనిపై అప్పట్లో వైఎస్ చనిపోతే పబ్లిక్ చనిపోవడం ఏంటీ ఇది మరి దారుణమని ఎల్లో మీడియా ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చింది. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేసింది. అయితే దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా జగన్ తన ఓదార్పు యాత్రను కంటిన్యూ చేశాడు.


ప్రస్తుతం అప్పుడు టీడీపీ నేతలు విమర్శించిన ఓదార్పు యాత్రనే ఇప్పడు చంద్రబాబు అరెస్టు విషయంలో చేపట్టాలని భావిస్తున్నారు. ఎందుకుంటే ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు అరెస్టు వల్ల చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం కల్పిస్తారని చెబుతున్నారు. అసలు వైఎస్ చనిపోతే చంద్రబాబు చనిపోతే వారి కుటుంబాల్లోని సభ్యులకు హర్ట్ ఎటాక్ రాదా? కేవలం  సామాన్య ప్రజల్లోని కుటుంబాలకు మాత్రమే గుండెపోటులు ఎందుకొస్తున్నాయి.


నేతల కుటుంబాల వారివి రాతి గుండెలా లేకపోతే అవి పగలకుండా నిర్మాణాలు జరిగాయా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి చనిపోతే.. ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకి వెళితే ఇదా జరిగేది. జనాల్లోకి వెళ్లి సామాన్యంగా చనిపోయిన సరే మీ కుటుంబానికి పలానా బాలకృష్ణ వచ్చి పరామర్శించి డబ్బులు ఇస్తారంటూ ప్రచారాలు చేస్తున్నారు. దీని కోసం చాలా మంది తప్పక ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి బాలకృష్ణ ఓదార్పు యాత్ర ఎప్పుడు చేపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: