గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్ధిక అభివృద్ధి కొరకు  ప్రారంభించబడిన కార్యక్రమం డ్వాక్రా (డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్). దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ మహిళల ద్వారా పొదుపు చేయించడం. ఇది మహిళలు తమ సొంత కాళ్లపై  తాము నిలబడడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్.  డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు మొదటగా రకరకాల రంగాల్లో శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది.


తర్వాత వారికి రుణ సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా వారికి జీవనోపాధిని కల్పించే విధంగా ఈ డ్వాక్రా గ్రూప్స్ అనేవి ఏర్పడ్డాయి. దీంతో వాళ్లలో ఒక మానసిక స్ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా వారి కుటుంబాలను వారు ధైర్యంగా  నడుపుకోగలుగుతారు. ఈ విధంగా ప్రతి ఇల్లు సుస్థిరంగా ఉంటే దేశం కూడా  సుస్థిరంగా ఉంటుంది. అయితే ప్రతి ప్రభుత్వం ఈ డ్వాక్రా గ్రూపులకు సహాయకారిగా ఉంటుంది.


ఎందుకంటే ఎలక్షన్ల టైం లో వారి కుటుంబాలను పోలింగ్ బూతులు వరకు నడిపించాలంటే అవసరమైంది ఈ మహిళలే కాబట్టి. అయితే ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ పార్టీ అయితే ఈ డ్వాక్రా మహిళలను మెప్పిస్తారో వారిదే కొత్త ప్రభుత్వం. అయితే తాజాగా మెప్మా ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తద్వారా పట్టణ ప్రగతి అనేది సునాయాసం అవుతుందని సాక్షి తన పత్రికలో వ్రాసుకొచ్చింది.


జగన్ వచ్చాక పట్టణ శివార్లలోని పేదలు ఉండే ప్రాంతాల్లో చిన్న చిన్న బళ్ళ వ్యాపారాలు పెరుగుతున్నాయి. కూరగాయల వ్యాపారాలు ఇలా రకరకాల వ్యాపారాలు బాగానే పెరుగుతున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తుల తయారీలో శిక్షణను ఇస్తామని మెప్మా చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడకు వెళ్లే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఒకవేళ వెళ్లినా చూసి వచ్చేస్తున్నారు. లేదంటే భోజనం చేసి వచ్చేస్తున్నారు తప్ప లాభం లేదు. అయితే వీళ్లకు ఒక దశ దిశా నిర్దేశం లేదా  ఒక ప్రణాళికను ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అద్భుతాలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: