సీఎం కేసీఆర్ కుటుంబ పాలన అని విమర్శించే వారు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత అని మాట్లాడుతుంటారు. అయితే వీరే కాకుండా సంతోష్ రావు కూడా ఒక్కరు. అయితే కేసీఆర్ కు వెనకాల ఉండి పనులు చేస్తుంది సంతోష్ రావే నని అంటున్నారు. ఈ రెండు రోజుల్లో ఓటర్లకు కావాల్సిన తాయిలాలు అందించడంలో సంతోష్ రావు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.


ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ లు సంతోష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా డబ్బులను పంపిణీ చేయడానికి, మీడియాను హ్యండిల్ చేయడంలో ఆయనే బీఆర్ఎస్ తరఫున పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎక్కడా కూడా ఆయన బయట ప్రపంచంలో కనిపించడం లేదని చెబుతున్నారు.  ముఖ్యంగా అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీకి కావాల్సిన పనులను చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు.


ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్ దూసుకుపోవడం వెనక సంతోష్ రావు పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ రావు రాజ్య సభ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఆయన ఎక్కడా ఎందుకు కనిపించడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన మాత్రం తన పనిని తాను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు కీలకమైన నియోజకవర్గాల్లో ఎలా ముందుకెళ్లాలి. ప్రతిపక్షాలను ఎలా దెబ్బకొట్టాలి. ఎక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలి.


తదితర విషయాలను కీన్‌గా అబ్జ ర్వ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో ఫోకస్ పెడితే..  కేటీఆర్ జీహెచ్ ఎంసీ నియోజకవర్గాల్లో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లో కీలకంగా ప్రచారం చేశారు.  అదే సమయంలో హరీశ్ రావు సిద్దిపేటతో పాటు సంగారెడ్డి, దుబ్బాక, మెదక్ లాంటి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్రలు చేస్తూ ముందుకు వెళితే తెర వెనక మాత్రం సంతోష్ రావు తాను చేయాల్సిన పనుల్ని చక్కబెడుతున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: