భారత అంతరిక్ష రంగంలో అత్యంత ప్రతిభావంతమైన దేశంగా భారత్ నిలుస్తుంది. ముఖ్యంగా డెవలప్ అయినా కంట్రీలతో పోల్చుకుంటే ఇస్రో తక్కువ ఖర్చుతో ఎక్కువ సక్సెస్ ఫుల్ విజయాలు అందుకుంటోంది. కనీసం క్రయోజనిక్ ఇంజిన్ కూడా తయారు చేసుకునేందుకు ప్రపంచ దేశాలు అనుమతి ఇవ్వలేదు. కానీ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇస్రో గగనతలంలో అద్భుత విజయాలు సాధిస్తోంది.  అయితే అంతరిక్షంలో జరిగిన అతి పెద్ద పేలుడు గామా రే బరస్ట్ ను ఇస్రో గుర్తించింది.


అస్ట్రో టెలిస్కోప్ ద్వారా గుర్తించడంతో ఇస్రోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రో టెలిస్కోప్ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ జీఆర్బీలు అంతరిక్షంలో అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చూస్తారు. ఇవి కృష్ణబిలాల పుట్టుకకు కారణాలవుతాయని తెలుస్తుంది. ఇవి అతితక్కువ వ్యవధిలోనే మిల్లి సెకన్ల లోపే ఈ పేలుళ్లు జరుగుతాయి. అప్పుడు అంతరిక్షంలో మిరుమిట్లు గొలిపే వెలుతురు అంతరిక్షంలో కనిపిస్తుంది.


అయితే ఈ పేలుళ్ల గురించి తెలుసుకోగలిగితే విశ్వ చలానాన్ని, భౌతిక, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని అనుకుంటున్నారు. 2015 సెప్టెంబర్ లో అంతరిక్షంలో పంపిన తొలి మల్టీ వేవ్ టెలిస్కోప్ ఈ జీఆర్ బీ పేలుళ్లను కనిపెట్టిందని తెలుస్తుంది. ఇది గరిష్టంగా 5 ఏళ్లు పని చేయాల్సి ఉన్నా.. కానీ 8 సంవత్సరాలు దాటిన అద్భుతంగా పని చేస్తుంది. అయితే ఇంతలా పని చేస్తుందని శాస్త్రవేత్తలు కూడా ఊహించడం లేదు.


అంతరిక్షంలో ఈ అస్ట్రోనెట్ టెలిస్కోప్ ఇప్పటి వరకు దాదాపు 600 పేలుళ్లను గుర్తించినట్లు సైంటిస్టులు పేర్కొన్నారు. నాసా సైంటిస్టులు కూడా దీన్ని పొగడ్తలో ముంచెత్తుతున్నారు. ఇంతటి ఘనత సాధించడానికి కారణం ఈ ఆస్ట్రో టెలిస్కోప్ లో ఉన్న పరికరాల సామర్థ్యం అని ఐఐటీ బాంబే పరిశోధకులు చెబుతున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా దీన్ని ప్రశంసల్లో ముంచెత్తుతుంది. ఇస్రో తక్కవ రూపొందిస్తున్న ఇలాంటి ప్రయోగాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: