నాణ్యమైన విద్య దాంతో పాటే ఉపాధి లభిస్తుందన్న కారణంగా అనేక దేశాల విద్యార్థులు అమెరికాకు తరలి వెళ్తుంటారు. అయితే అమెరికా ప్రభుత్వం ప్రతిభావంతులకే తమ విద్యాసంస్థల్లో అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. భారత్ నుంచి అగ్రరాజ్యం వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.  అయితే భారతీయ విద్యార్థుల వీసా ప్రక్రియలో అమెరికా పలు మార్పులు చేసింది.


అవును అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు ఎఫ్,జే స్టూటెండ్ వీసా కింద దరఖాస్తు చేయబోతున్న విద్యార్థుల వీసా ప్రక్రియలో అమెరికా పలు మార్పులు చేసింది. ఈ మార్పులను యుఎస్ ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ఈ సవరణలు గత సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.


ఎఫ్, జే  వీసాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ సొంత పాస్ పోర్టు నంబర్ తో ప్రొఫైల్ తయారు చేసుకోవాలని సూచించింది. తప్పడు పాస్ పోర్టు సమర్పిస్తే మాత్రం దరఖాస్తు రిజెక్ట్ చేసి డిపాజిట్ చేసిన సొమ్మును కూడా వాపస్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.


తప్పుడు పాస్ పోర్టు నంబర్ తో ఫ్రొఫైల్ సృష్టించుకున్నవారు మళ్లీ సరైన నంబర్ తో కొత్త ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మళ్లీ వీసా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్ పోర్టు పోవడం, చోరీకి గురవడం వంటి సందర్భాల్లో కొత్త పాస్ పోర్టు తీసుకున్నవారు పాత పాస్ పోర్టు కు సంబంధించిన కాపీ, ఇతర డాక్యుమెంట్లను అందించాలి.


అప్పుడే వారి అపాయిట్మెంట్ ప్రాసెస్ కు అనుమతి లభిస్తుంది. ఎఫ్, ఎం వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రాం ధ్రువీకరించిన స్కూల్, ప్రోగ్రాంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్ షిప్ పొందాలి. తప్పుడు ధ్రువపత్రాలతో భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్తున్నారన్న ఉద్దేశంతో అగ్రరాజ్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA