విచ్ఛిన్నకర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఎదుటి వారి నాశనం కోసం.. తమ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.  ఇందులో రాజకీయ పార్టీలు, మీడియా సమపోత్ర పోషిస్తోందని అనిపిస్తోంది. కంపెనీలు రావడం లేదంటూ ప్రచారం చేస్తుంటారు. అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలు వస్తుంటేనేమో దోచి పెడుతున్నారు అని వార్తలు రాస్తున్నారు.


ఇన్పోసిన్, పవర్ ప్లాంట్లు, స్టార్టప్ కంపెనీలు, ఇతర పరిశ్రమలు తరలి వస్తుంటే వాటిపై ప్రచారం తగ్గిస్తారు. నెగిటివ్ అంశాలను భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. పాజిటివ్ అంశాలను అప్రధాన్య అంశంగా పరిగణిస్తారు.  ఎవరైనా కంపెనీ స్థాపించి ఉపాధి కల్పిస్తామంటే వద్దంటారా.. ఒక ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తే అక్కడ మౌలిక వసతులు పెరిగి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ స్థానిక ప్రజలను రెచ్చగొట్టి తమ స్వలాభం కోసం కంపెనీలను అడ్డుకుంటున్నారు.


తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఎలక్టిక్  బస్సులు, ట్రక్కులు తయారీ కంపెనీకి షాక్ ఇచ్చారు స్థానిక గ్రామస్థులు. పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లె సమీపంలో త్వరలో ఎలక్ర్టిక్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమ రానుంది. జర్మనీకి చెందిన పెప్పర్ ఎలక్టి్రక్ బస్ తయారీ సంస్థ  తమ యూనిట్లను ఇక్కడ నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా తొలిసారిగా ఈ గ్రామాలను కంపెనీ టీం సందర్శించింది. అయితే పుంగనూరు గ్రామాల ప్రజలు బస్సులు, ట్రక్కుల తయారీ కంపెనీ ఇక్కడ వద్దని ఆందోళనలు చేపడుతున్నారు.


పరిశ్రమ రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. దీంతో  పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు రూ.4640 కోట్లతో 800 ఎకరాల్లో బస్సులు, ట్రక్కుల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు వచ్చిన కంపెనీని ఆ గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని వారు విజ్ఙప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: