కొన్ని రాజకీయ పార్టీలకు ఇండియాలో ఉండటం ఇష్టం లేదేమో అనిపిస్తోంది.  పరాయి దేశం మీద ఉండే సానుభూతి మన భారతీయులపై ఎందుకు చూపించరో అనే ప్రశ్నలు తలెత్తుతాయి.  ఎందుకంటే పశ్చిమ బెంగాలలోని తృణమూల్ ప్రభుత్వం బంగ్లాదేశీయులను మన దగ్గరికి ఆహ్వానించి వారికి మన దేశపు పౌరసత్వం ఇవ్వాలని చూస్తున్నారు. మరో వైపు భారతీయుల్నీ అక్కడి ముస్లింలు ఇబ్బందులకు గురి చేస్తున్నా నోరు మెదపకుండా.. ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునుందుకు యత్నిస్తుంటారు.


ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లుపై చర్చల సందర్భంగా టీఎంసీఎ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.  జమ్మూ కశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించి ఏం సాధించారు అని కేంద్రాన్ని ప్రశ్నించారు.  అక్కడ శాసన సభలే లేనప్పుడు ఈ సవరణ బిల్లులు పెట్టి ప్రయోజనం ఏంటని.. ముందు శాసన సభలు ఏర్పాటు చేసి ఆ తర్వాత సవరణలు చేయాలని సూచించారు.


ఒకే ప్రధాని.. ఒకే జెండా, ఒకే రాజ్యాధికారం సాధించేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. ఈ నినాదం శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇచ్చారు. ఇది జమ్మూ కశ్మీర్ ప్రజలకు వర్తించదు అని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు.


దీనిపై హొం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఒకే జెండా.. ఒకే ప్రధాని.. ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం కాదని, ఆ సూత్రాన్ని బీజేపీ బలంగా విశ్వసిస్తోందన్నారు.  ఒక దేశానికి రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు ఎలా ఉంటారని ప్రశ్నించారు.  ఇది ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన తప్పే. దీనిని ప్రధాని మోదీ సరిదిద్దారు. ఏక్ ప్రధాన్, ఏక్ నిషాన్, ఏక్ విధాన్ ఉండాలని మేం 1950 నుంచి చెబుతున్నాం. దానినే మేం చేసి చూపించాం అని షా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: