
రాహుల్ గాంధీ పోరాటం, రేవంత్ రెడ్డి దృఢసంకల్పం కారణంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించిందని శ్రీనివాస్ ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందనప్పటికీ, రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టి 56.36 శాతం బీసీలు ఉన్నారని నిర్ధారించారని ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు తాను బలపరిచినందుకు గర్వపడుతున్నానని శ్రీనివాస్ తెలిపారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బీసీలకు అంకితమని ఆయన అన్నారు.
తెలంగాణ కులగణన ఫలితాలు దేశవ్యాప్త కులగణనకు దిశానిర్దేశం చేశాయని శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో బీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధి కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసిందని, కానీ రేవంత్ రెడ్డి నిజాయితీగా కులగణన నిర్వహించి బీసీలకు న్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నాకు రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై మద్దతు తెలిపారని, కానీ బీజేపీ, బీఆర్‌ఎస్ సహకరించలేదని విమర్శించారు. కులగణన లేకపోతే బడుగు వర్గాల ఆగ్రహం తప్పదని బీజేపీ గ్రహించిందని ఆయన అన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు