- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే క్రమంలో టాలీవుడ్ లో ఆ నలుగురు కలిసి థియేటర్ల బంద్ అంశాన్ని తెరమీదకి తెచ్చారన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్లో జనసేనకే చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల‌ దుర్గేష్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేయడం .. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ తన కార్యాలయం నుంచి ఒక నోట్ రిలీజ్ చేయడంతో ఈ వివాదం తీవ్రమైంది. ఇదిలా ఉంటే థియేటర్లను తమ ఆధీనంలో ఉంచుకున్న ఆ నలుగురు లీలలు అన్నీ ఇన్ని కావు అని తెలుస్తోంది. ఏదైనా ఒక పెద్ద సినిమాను థియేటర్లో ప్రదర్శించినప్పుడు ఎక్కువ లాభాలు లేదా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అలాంటప్పుడు అద్దె మాత్రమే ఇస్తున్నారని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ చెబుతున్నారు.


ఉదాహరణకు ఐదు నుంచి ఇర‌వై లక్షలు వసూలు చేసే సినిమాకు 20, 000 అద్దె ఇచ్చి సరిపెడుతున్నారని ... అదే 20 నుంచి 20 వేలు వసూలు చేసే చిన్న సినిమాకు పర్సంటేజ్ అని తక్కువ మొత్తం చేతుల్లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అలా ఆ నలుగురు తమకు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ టాలీవుడ్ను సర్వ నాశనం చేస్తున్నారు అంటూ నట్టి కుమార్ తీవ్రమైన విమర్శలు చేశారు. వీరి తీరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడిపే పరిస్థితి లేదని .. సింగల్ స్క్రీన్ థియేటర్లను కూడా ఆదుకునే వ్యవస్థలో మార్పులు రావాలని నట్టి కుమార్ కోరారు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను మైత్రి మూవీస్ కు సీతారా నాగ వంశీ ద్వారా పంపిణీ చేస్తున్నారన్న అక్క‌సుతోనే ఆ నలుగురు కలిసి సినిమాను అడ్డుకునే కొత్త కుట్ర‌కు తెర‌లేపార‌ని న‌ట్టి ఇప్పటికే విమర్శించిన సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: