దేశవ్యాప్తంగా ఒక సంచలనం గా మారిపోయింది హిజాబ్ వివాదం.. ఈ వివాదం కారణంగా కర్ణాటక ప్రాంతంలోని కొన్ని పాఠశాలలు మూతపడడం జరిగింది. అయితే  వీటన్నిటికీ ఈరోజు తో పుల్ స్టాప్ పెట్టి ఈరోజు నుంచి పాఠశాల పున ప్రారంభం చేయనున్నది కర్ణాటక ప్రభుత్వం. అయితే కళాశాలలు, యూనివర్సిటీల ప్రారంభ విషయంపై ఇంకా సందిగ్ధం విధంగానే ఉంది ప్రభుత్వం.అయితే వీటిపై ప్రభుత్వం కూడా తగిన నిర్ణయం తీసుకోలేక పోవడం తో.. మరికొద్ది రోజులు కళాశాలలు, వర్సిటీలు మూతపడనున్న ట్లు సమాచారం.


ఇక ముందస్తు చర్యలలో భాగంగా ఈ నెల 19వ తేదీ వరకూ.. ఉడిపి ప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేసినట్లుగా ఆ జిల్లా అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆకు కొనసాగుతున్నాయని అధికారులు తెలియజేశారు. ఇక కర్ణాటక ప్రాంతంలో త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొని, సాధారణ పరిస్థితిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ తెలియజేశారు.ఇక పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున పాఠశాలలో ఓపెన్ చేశామని తెలియజేశారు. ఇక కళాశాలలో, యూనివర్సిటీల ప్రారంభం పై ఇంకా తగు నిర్ణయం తీసుకోలేదు అని తెలియజేశారు.


మరికొద్ది రోజులు పరిస్థితులను సమీక్షించి తర్వాత వీటిని ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థుల పట్ల ఉద్రిక్తతను తగ్గించే విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడాలని ఆదేశాన్ని జిల్లా అధికారులకు జారీ చేసినట్లుగా సీఎం తెలియజేశారు. హిజాబ్ కొంతమంది అనుకూలంగా, మరికొంత మంది వ్యతిరేకంగా ఉండడంతో కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఇక ఇలాంటి సమయంలో పాఠశాలలు మూసివేయడం మంచిదని ఈ నెల 9వ తేదీన మూసి వేయడం జరిగింది. అయితే ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు విచారణ అనంతరం పాఠశాలలు ఓపెన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: