మానసిక ఆరోగ్యానికి ఇవి ఖచ్చితంగా తినాలి?


ఇక మనం తీసుకునే ఆహారం..మన శరీరంలోని మిగిలిన భాగాల లాగానే మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్య రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఆహారం ఇంకా జీవనశైలి మార్పులు కూడా తీసుకువస్తుంది.కారణం లేకుండా చిరాకు పడటం అలాగే చెడు మానసిక కల్లోలంతో పోరాడటం ఇదంతా కూడా సెరోటోనిన్ లోపానికి సంకేతం.మెదడులో సెరోటోనిన్‌ను పెంచడానికి పైనాపిల్‌లో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది.అలాగే పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అంతేగాక ఇందులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే సోయా ఉత్పత్తుల్లో కూడా ట్రిప్టోఫాన్  గొప్ప వనరులు ఉంటాయి.విటమిన్ బి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆవేశం ఖచ్చితంగా తగ్గుతుంది.ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు.అలాగే బాదంలో ఫోలేట్ ,మెగ్నీషియంతోపాటు చాలా రకాలం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 


మెగ్నీషియం అనేది సెరోటోనిన్ అభివృద్ధిలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మీ మెదడులో సంతోషాన్ని కలిగించే భావాలకు ప్రధానంగా సహాయపడుతుంది. బాదంపప్పులో విటమిన్లు B2, E కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడి సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది.ఇక ఇది సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసే అమైనో ఆమ్లం. అందువల్ల నిద్ర విధానాలు, మానసిక స్థితిని నియంత్రించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ఇక అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో ట్రిఫ్టోఫాన్ ని 5-HTPని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.అంతేగాక సెరోటోనిన్, మెలటోనిన్‌లను తయారు చేస్తుంది. ఈ రెండూ కూడా మానసిక స్థితిని బాగా మెరుగుపరచడంతోపాటు, అధిక నిద్రను నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్‌లను చేస్తాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి రోజూ కూడా అరటిపండు తీసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: