పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్చ‌మే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా ఉంటుంది. కాలీఫ్లవర్ ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో గుణాలున్నాయి. దీన్ని ఎక్కువగా గోబీ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. పోషకాలు ఎక్కువ గానూ, క్యాలరీలు తక్కువగానూ కాలీఫ్లవర్‌లో ఉంటాయి. సాధార‌ణంగా  వండేటప్పుడు వాసన వస్తుందని కాలీఫ్లవర్‌ని ఆహారంగా తీసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అయితే కాలీ ఫ్లవర్ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

 

కాలీఫ్లవర్‌ లో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కూరల ద్వారా లేదా సలాడ్ ల రూపంలో వీటిని తీసుకుంటూ ఉంటే.. త్వరగా బరువు తగ్గవచ్చు. కాలీఫ్లవర్‌ని పచ్చిగా తినడం వల్ల దంతసమస్యలు దూరం.. దంతసమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా కాలీఫ్లవర్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఇందులో  విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఉంటాయి. 

 

అంతేకాకుండా.. కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. దీంతోపాటు మ‌న శ‌రీరానికి ఎక్కువ ప్రోటీన్ల‌ను ఇవ్వ‌డంలోనూ కాలీఫ్ల‌వ‌ర్ మేలు చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం కాలీఫ్లవర్ బాగా ఉపయోగ‌ప‌డుతుంది. మ‌రియు కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కాలీఫ్లవర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తీసుకుంటే సమస్యనుంచి ఉపశమనం. వారంలో ఒక్కసారైనా కాలీఫ్లవర్‌ని తీసుకోవడం హృద్రోగ సమస్యలతో పాటు ఎన్నో వ్యాధులు దూరం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: