ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. చలి కాలంలో జామ కాయలు లేదా జామ పండ్లను తినడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జలుబుతో బాధపడేవారు జామ తినొద్దని చాలామంది చెబుతుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే.. జామ కాయలో జలుబును తగ్గించే లక్షణాలున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు ఒక పెద్దసైజు జామకాయను తీసుకుని.. అందులో గింజలు తీసేసి తినాలి. ఆ తర్వాత గ్లాసు నీళ్లు తాగితే ఔషదంలా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

జామకాయలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయట. జామ నుంచి లభించే పీచు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుందట. జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. ఉంటుందట.


తలనొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధపడేవాళ్లు పచ్చిజామకాయను ముద్దలా చేసుకుని.. రోజులో మూడు నాలుగుసార్లు నుదుటి మీద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి... నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుందట. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిదట. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతోంది. అయితే, డయాబెటీస్ (మధుమేహం) రోగులు మాత్రం ఇలా చేయొద్దు.జామ ఆకు రసాన్ని వెన్నెముక మీద రాస్తే... మూర్ఛవ్యాధి సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.జామలో ఉంటే కాపర్, థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: