
మునగాకులో ఎన్నో ఔషధగుణాలు, పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మునగాకును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదే విధంగా ఇందులో ఉన్నటువంటి విటమిన్లు మన శరీరానికి తగినంత వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం తోపాటు ఇతర కంటి సమస్యలు, జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది.
ఇందులో ఉన్నటువంటి ఐరన్ జింక్ మన శరీరానికి కావలసిన మోతాదులో అందటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.ముఖ్యంగా మన శరీరంలో ఏర్పడినటువంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పనితీరును మెరుగు పరచడం కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అధిక ఒత్తిడి ఆందోళనల నుంచి మనకు పూర్తిగా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఈ మునగాకు తాలింపు తినటం ద్వారా బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా జుట్టు పెరుగుదలకు ఇతర చర్మ సమస్యలకు కూడా మునగాకు నివారణగా పనిచేస్తుంది. మునగ చెట్టు నుంచి లభించేటటువంటి ఆకు, కాయలు తినడం వల్ల దాదాపు మూడు వందల రోగాలను నయం చేయవచ్చనీ ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.