ఇక పనస గింజల్లో ఎన్నో ఆరోగ్య గుణాలు వున్నాయి. వీటిలో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, రోగ నిరోధక శక్తి చికిత్స పొందే రోగులపైన ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఇక పనస పండుతో గుండెపోటు సమస్యని దూరం చేసుకోవచ్చు.అలాగే పనస గింజలలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌-C, ఇంకా విటమిన్‌-A పుష్కలంగా ఉంటాయి.అలాగే ప్రమాదకరమైన పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు పనసలో ఉన్నాయి.ఇంకా ఆస్తమాను తొలగించి, ఎముకలకు మంచి బలాన్నిస్తుంది.అలాగే అనీమియాను పూర్తిగా దూరం చేస్తుంది.ఇక పనసలోని విటమిన్-ఏ మెదడు నరాలను బలపరుస్తుంది.అలాగే పనసలో ఉండే పొటాషియం షుగర్ వ్యాధిని , గుండెపోటును నియంత్రిస్తుంది.ఇంకా పనస అజీర్తి సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తుంది.ఇంకా పనస మన కంటి దృష్టిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

ఇక పురుషుల్లో వీర్యవృద్ధికి పనస పండు ఎంతగానో సహకరిస్తుంది.ఇక పనస ద్వారా వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.ఇక పనసలోని ఫైబర్ బాధాకరమైన పైల్స్‌ను నివారిస్తుంది.ఇక పనస లేత తొనల్ని మంచిగా వేయించి తీసుకుంటే పిత్తం తొలగిపోతుంది.అంతేగాక పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనతని నివారిస్తుంది.ఇక పచ్చి పనసలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వండుకునే రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అలాగే పనసలో సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. పనస షుగర్ రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది.ఇంకా మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
ఇక పనన గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు అనేవి దూరమవుతాయి.
పనస కాయ వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే న్యూట్రీషియన్లు లేదా వైద్యుల సూచన తప్పక తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: