పిస్తాలు వంటకం రుచిని పెంచేందుకు చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా పొట్ట చుట్టు కొవ్వును తగ్గించడానికి పిస్తా సహాయపడుతుంది. పిస్తా పలుకులను క్రమం తప్పకుండా తినడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ అంశంపై గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్‌ వివరించారు.ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక పిస్తాపప్పు తినడం వల్ల శరీరానికి చాలా రకాల లభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. ఇంకా దీనితో శరీరానికి ఉత్తమమైన ప్రోటీన్స్‌ లభిస్తాయని కూడా నిపుణులు పేర్కొన్నారు. ఇది కండరాలను బాగా బలపరిచి.. శరీర బరువును తగ్గించడానికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా వృద్ధాప్యంతో ఎముకలు బలహీనపడటం అనేది అనివార్యం.. కానీ కొంతమందికి చాలా చిన్న వయస్సులోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక అటువంటి పరిస్థితిలో.. పిస్తాపప్పులను తప్పనిసరిగా తినాలని వైద్యులు ఖచ్చితంగా సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మెగ్నీషియం ఇంకా పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నందున.. ఇవి ఎముకలకు చాలా మంచి మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మధుమేహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద తీవ్రమైన సమస్యగా మారింది. ఈ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు.. ప్రతిరోజూ కూడా ఉదయం పూట అల్పాహారంలో పిస్తాపప్పులు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుందని వారు తెలుపుతున్నారు.పిస్తాలో జియాక్సంతిన్ ఇంకా లుటిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి.ఇంకా మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో కూడా జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో పిస్తాపప్పును తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు జ్ఞాపకశక్తి పెంచేందుకు బాగా కృషి చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: