
కొబ్బరినీళ్లను అధికంగా తీసుకోవడం వల్ల, 45 కేలరీలు, కొవ్వు 0g, కొలెస్ట్రాల్ 0mg, సోడియం 25mg, పొటాషియం 470mg,కార్బోహైడ్రేట్లు 11g , చక్కెర 11g,ప్రోటీన్ 0g, కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్ 4% మొతాదులో లభిస్తాయి.
వీటివల్ల కొబ్బరి నీళ్లలో పొటాషియం,సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కళంగా లభిస్తాయి.వేసవిమాసాల్లో శరీరానికి ఎక్కువ చెమట వల్ల ఎలక్ట్రాలైట్స్ కోల్పోతాయి.వాటిని రీప్లేస్ చేయడానికి కొబ్బరి నీరు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాక అధికరక్తపోటును తగ్గించడానికి కొబ్బరి నీరులో వున్న పోటాషియం చాలా బాగా సహాయపడుతుంది.కొబ్బరి నీళ్లలో పుష్కళంగా లభించే మెగ్నీషియం మలబద్ధకానికి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.ఇన్ని ప్రయోజనాలు కలిగిన కొబ్బరి నీళ్లు కొన్ని జబ్బులు కలవారు అధికంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తూన్నారు.
అందులో ముఖ్యంగా అధిక రక్తపోటుకు టాబ్లెట్స్ తీసుకునేవారు కొబ్బరినీరును తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని పొటాషియం,లోబీపీ అయ్యేలాగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున బీపీ టాబ్లెట్లు వేసుకునే వారు అప్పుడప్పుడు తీసుకోవడం చాలా ఉత్తమం.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కొబ్బరినీరు తీసుకుంటే,అది సులభంగా హైపర్కలేమియాకు దారి తీస్తుంది.దానితో ఆకస్మిక మరణానికి సంభవించవచ్చు.మధుమేహంతో బాధపడే వారు కూడా అధికంగా కొబ్బరినీరుని తీసుకోకూడదు. కారణం ఇందులోనే సహజ చక్కెరలు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ సమస్యలతో బాధపడేవారు అధికంగా కొబ్బరినీళ్ళు తీసుకోకుండా మితంగా తీసుకోవడం చాలా ఉత్తమం.