చలికాలం ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకు వస్తుంది.శరీరంలో అంతర్గతంగా ఉండే అనారోగ్య సమస్యలు చలికాలంలో చాలా ఎక్కువ అవుతాయి.అందువల్ల జీర్ణశక్తి మందగిస్తుంది.అలాగే కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా అవుతాయి. కాబట్టి మనం చలికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను, కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలను తీసుకోవాలి.  సులభంగా ఒక లడ్డూను తయారు చేసి తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి మనం చాలా చాలా సులభంగా బయటపడవచ్చు.మనం ఈ లడ్డూలను చలికాలంలో రోజుకు ఒకటి తీసుకుంటే చాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. చలికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..  ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి  మనం 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను, ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును, 100 గ్రాముల జీడిపప్పును, 100 గ్రాముల బాదంపప్పును, ఒక టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్షను, అర టీ స్పూన్ యాలకుల పొడిని ఇంకా అలాగే తగినంత నెయ్యిని ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు కళాయిలో జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. ఆ తరువాత అవిసె గింజలు వేసి వేయించాలి.ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెల్లం, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే అవిసె గింజల లడ్డూలు తయారవుతాయి. ఇలా తయారు చేసిన లడ్డూలను రోజుకు ఒకటి తినడం వల్ల రక్తహీనత సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే ఎముకలు కూడా చాలా ధృడంగా తయారవుతాయి.కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా చలికాలంలో వచ్చే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: