ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఎంతో మంచిది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా వ్యాయామాన్ని దూరం పెట్టారు అంటే ఇక తర్వాత కాలంలో వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నిజంగానే ఇలా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం మంచిది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నేటి రోజుల్లో జనాలకు  వ్యాయామం కోసం కేటాయించడానికి సమయమే లేకుండా పోయింది.



 ఉరుకుల పరుగుల జీవితంలో మనీ కోసం పరుగులు పెడుతున్న మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేసాడు. వెరసి.. ఇక వ్యాయామం గురించి ఆలోచించడం లేదు. ఈ క్రమంలోనే వ్యాయామం చేయాలని ఉన్న.. సమయం లేక చివరికి సైలెంట్ గానే ఉండిపోతున్నారు ప్రతి ఒక్కరు. కాగా నేటి రోజుల్లో అన్ని విషయాల్లో టెక్నాలజీ పెరిగినట్లుగానే ఇక వ్యాయామం విషయంలో కూడా ఏదో ఒక వినూత్నమైన ఆవిష్కరణ వస్తే బాగుండు అని అందరూ కోరుకుంటున్నారు. ఇక టాబ్లెట్ వేసుకుంటే వ్యాయామం చేసినట్లుగా మారితే ఎంత బాగుంటుంది అని ఎంతోమంది కలలు కూడా కన్నారు. అయితే ఇక ఇప్పుడు ఈ కల నిజం కాబోతుంది.


 ఏకంగా వ్యాయామం చేయడానికి ఇష్టమున్న సమయం లేక కొంతమంది ఇక ఎక్సర్సైజ్ కి దూరంగా ఉంటే.. ఇంకొంతమంది బద్ధకంతో వ్యాయామం చేయరు. అయితే ఇలాంటి వారి కోసం ఎక్సర్సైజ్ పిల్ వచ్చేస్తుంది. వ్యాయామం చేస్తే కలిగే లాభాలు.. ఈ ఒక్క మాత్రలో ఉంటాయట. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఎలుకలపై వీటిని పరీక్షించినప్పుడు వ్యాయామం చేశాక ఉండే జీవ క్రియని వాటిలో గుర్తించారట. ఇది సక్సెస్ అయితే గుండె, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ముందడుగు పడుతుందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: