చిన్నపిల్లలు ఆహారం తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు. పిలల్లకు అన్నం తినిపించడానికి మనం కూడా ఇంట్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాము. అయితే వంట చేసేటప్పుడు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ పై అవగాహన ఉండాలి. మనం తినే ప్రతి కాంబినేషన్ ఆరోగ్యానికి మంచి చేస్తాయని భావించడం సరికాదు. కొన్ని ఆహారపదార్థాలతో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను కలపకూడదు. వీటి వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లల జీర్ణవ్యవస్థ ఇంకా ఎదుగుదల దశలోనే ఉండటం వలన వారికిచ్చే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ఇప్పుడు మనం పిల్లలకిచ్చే ఏయే ఫుడ్ కాంబినేషన్స్ వలన వారి ఆరోగ్యం దెబ్బతింటుందో తెలుసుకుందాం.

 

 

పిజ్జా, సోడా ఈ ఫుడ్ కాంబినేషన్ పై  పిల్లలు మనసు పారేసుకుంటారు. అయితే ఈ ఫుడ్ కాంబినేషన్ వారికి చాలా ప్రమాదకరం. పిజ్జాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని డైజెస్ట్ చేసే సమయంలో శరీరంలో స్టోర్ అయి ఉన్న శక్తి మొత్తం వినియోగించడం జరుగుతుంది. అందులో డ్రింక్ ను తీసుకోవడం ఈ స్థితిని మరింత దిగజారుస్తుంది. ఈ కాంబినేషన్ మీ పిల్లల కడుపును పాడుచేస్తుంది. అందువలన ఈ కాంబినేషన్ పిల్లలకు అత్యంత డేంజరస్ ఫుడ్ కాంబినేషన్ లో ఒకటి. అరటిపండు,పాలు ఈ రెండింటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విడి విడిగా వేరు వేరు సమయాలలో తింటే వీటి ద్వారా ప్రయోజనాలు అందుతాయి. వీటిని కలిపి తీసుకోవడం వలన సమస్యలు తలెత్తుతాయి. ఇది చాలా హెవీ కాంబినేషన్. ఇది పిల్లలకు మగతను కలిగించి వారికి నిద్రపోవాలని అనిపించేలా చేస్తుంది. బర్గర్,ఫ్రెంచ్  ఫ్రైస్ ఇది చాలా మంది పిల్లలకు ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్. 

 


బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు బాగా డీప్ ఫ్రై చేయబడిన ఆహార పదార్థాలు. ఇవి బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి. ఈ పరిస్థితిని పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలరు కానీ పిల్లలు మాత్రం తట్టుకోలేరు. అందువలన వీలైనంత వరకు ఈ ఫుడ్ కాంబినేషన్ నుంచి మీ పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిది.పండ్లు, పెరుగు ఇవి కూడా హెల్తీ ఫుడ్స్ కేటగిరీలోకే వస్తాయి. అయితే ఈ ఆహారాన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం చూపుతుంది. ఈ ఫుడ్ కాంబినేషన్ ను తీసుకోవడం వలన ఉత్పత్తయ్యే టాక్సిన్స్ పదేళ్ల లోపు పిల్లలకు సహాయకారి బాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఫలితంగా దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తాయి. కొన్ని సార్లు ఈ కాంబినేషన్ అలర్జీకు కూడా దారితీస్తాయి. ఒకవేళ, ఈ రెండు పదార్థాలను పిల్లలకు తినిపించాల్సి వస్తే రెండిటికీ మధ్య కనీసం ఒక గంట సమయం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: