ఎవరైనా తీవ్ర బాధలో ఉంటే వారికొక కౌగిలింత ఇచ్చి కాస్త ధైర్యం చెప్తే చాలు వారి మనసు తక్షణమే కుదుటపడుతుంది. ఒక సింపుల్ హగ్ కూడా మూడ్ ని ఎంతగానో చేంజ్ చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నా, మరే ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారి బాధను ఒక హగ్ తో పోగొట్టవచ్చు. మేమున్నామని భరోసా ఇచ్చేందుకు కౌగిలింత ఇస్తుంటారు. అయితే కౌగిలింత పుచ్చుకునే వారికి వెంటనే కొండంత ధైర్యం, ఉపశమనం కలుగుతుంది.

కౌగిలింతలో ఎంత పవర్ ఉందో ప్రతి ఏడాది గుర్తు చేసేందుకు ప్రత్యేకంగా హగ్ డేస్ ని ఏర్పాటు చేశారు. హగ్ డేస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు అత్యంత ప్రియమైన వారికి ఒక ఎక్స్ట్రా హగ్ ఇచ్చి వారి ఆనందానికి కారణం అవుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, అన్నయ్యలు తమ్ముళ్లకు, తమ్ముళ్లు అక్కలకు, చెల్లెళ్లకు.. ప్రియుడు ప్రియురాలికి, భర్త భార్యకు ఇలా ప్రతి ఒక్కరూ తమ బంధాన్ని బలపరచడానికి ఈ హగ్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు.

అయితే జూన్ 29వ తేదీన హగ్స్ ఫర్ హెల్త్ డే అనే ఒక ఫౌండేషన్ "నేషనల్ హగ్ హాలిడే డే" ఏర్పాటు చేసింది. అయితే మొదట్లో వృద్ధుల హగ్ డే గా ఉన్నప్పటికీ, ఈ సెలవుదినం ప్రస్తుతం అందరికీ వర్తిస్తుంది. ఈ రోజు ఇష్టపడే వ్యక్తికి కౌగిలింత ఇచ్చే రోజుగా మారింది. అయితే ఫారిన్ దేశాలలో తెలియని వ్యక్తులకు కూడా హగ్స్ ఇస్తుంటారు. ఒంటరిగా నివసించే చాలామంది ఇతర వ్యక్తులకు కౌగిలింత ఇచ్చి మానసిక ప్రయోజనాలు పొందుతారు. ఇక మరికొందరు తమ ప్రియమైన వారికి ఆప్యాయంగా, సుతిమెత్తగా వెచ్చటి హగ్ ఇచ్చి ఎంతో మానసిక ప్రశాంతతను కలిగిస్తారు. ప్రియమైన వారు కూడా కౌగలింతను ఎంజాయ్ చేస్తూ చాలా సౌకర్యంగా ఫీలవుతారు. మన భారతదేశంలో కూడా హగ్ డే కి ప్రాధాన్యత సంతరించుకుంటోంది. బంధువులు, స్నేహితులు తమకు ప్రియమైన వారిని ఆప్యాయంగా హత్తుకుంటూ హగ్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: