గతంలో ఆడవారిని ఇల్లు దాటి బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఎవరి ముఖం చూడనిచ్చేవారు కాదు. ఆడవారు చదువుకోవడానికి, బయటకు వెళ్లి పని చేయడానికి కూడా అసలు కుదరని పరిస్థితి అయితే ఉండేది. అదో పెద్ద ఘోరంగా, పెద్ద నేరంగా లెక్క కట్టేవారు. కానీ ఇప్పుడు సమాజంలో మారిన పరిస్థితుల్లో దృష్ట్యా  ఆడవారికి అనుకూలంగా వచ్చిన అనేక చట్టాల దృష్ట్యా ఆడ మగ సమానం అనే విషయం ప్రస్తావనలోకి వచ్చింది.


మగవారితో సమానంగా ఆడవారు కూడా బయటకు వెళ్లి వర్క్ చేస్తున్నారు. అయితే మగవారికి డ్యూటీ ఆఫీస్ గుమ్మం దాటగానే అయిపోతే  ఆడవారికి మాత్రం ఇంట బయట కూడా పనిచేయడం తప్పడం లేదు. అది కూడా బయట చేసే పనికి జీతం  తీసుకుంటుంటే ఇంట్లో చేసే పనికి జీతం లేని చాకిరీ చేస్తున్నారు మా మహిళలు అంటూ కొంతమంది మహిళలు వాపోతున్నారట.


అయితే వారి గోడు విన్నదో ఏమో గానీ స్పెయిన్ ప్రభుత్వం ఇంటిదగ్గర చాకిరీ చేసే మహిళల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ని తీసుకొస్తుందట. ఆ యాప్ ప్రకారం ఇంటిలో ఉండే మగవారు ఆడవాళ్ళు ఎంత ఎంత పని చేస్తున్నారో దాని ద్వారా రిజిస్టర్ చేయాలట. అలా రిజిస్టర్ చేసిన దానిని అక్కడ ప్రభుత్వం మానిటర్ చేస్తుందట. ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అని మహిళలకు వర్క్ ఎక్కువ అవ్వడంతో ఇంటిదగ్గర మగవాళ్ళు కూడా పనిచేయాలని ఒక చట్టం రూపంలో ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తుందట.


అసలు మహిళలు ఇంటి దగ్గర వంట పని, ఇంటి పని అంటూ  జీతం లేని జాబ్ చేస్తున్నారట. వీటిని డబ్బుల్లో లెక్క కడితే ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష 70 వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుందట ఈ అన్ పెయిడ్ వర్క్ కి. ఇకనుండి స్పెయిన్ ప్రభుత్వం ఈ విషయాన్ని మానిటరింగ్ చేస్తుందన్నట్లుగా తెలుస్తుంది. ఇది భారతదేశంలో వస్తే మగాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కానీ ఆడవాళ్లు హ్యాపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: