దుక్క రొట్టె గురించి ఎప్పుడైన విన్నారా? మినపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మన పూర్వకాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసేవారు.అల్పాహారంగా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది.దీనిని తినడం వల్ల మన శరీరానికి చాలా బలం కలుగుతుంది. పిల్లల నుండి పెద్దల దాకా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఇంకా అలాగే వెరైటీ రుచులను కోరుకునే వారు వెరైటీ వంటలు తయారు చేయాలనుకునే వారు ఈ దుక్క రొట్టెను తయారు చేసుకోవచ్చు. ఈ దుక్క రొట్టెను తయారు చేయడం కూడా చాలా సులభం.మంచి రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్న అందించే ఈ దుక్క రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా ఒక జార్ లో మినపప్పు వేసి రవ్వ లాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే జార్ లో బియ్యం కూడా వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి.ఆ తరువాత పచ్చిమిర్చిని, అల్లాన్ని దంచి వేసుకోవాలి. తరువాత ఇంగువ, జీలకర్ర, కరివేపాకు తరుగు ఇంకా తగినన్ని నీళ్లు పోసి కలపాలి.దీనిపై మూత పెట్టి రాత్రంతా కూడా పులియబెట్టాలి. ఆ తరువాత పిండిలో ఉప్పు వేసి కలపాలి. ఇక ఇప్పుడు అడుగు మందంగా ఉండే చిన్న కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తరువాత తయారు చేసుకున్న పిండిని వేసి పైన సమానంగా చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ఆవిరి బయటకు పోయేలా కొద్దిగా సందును ఉంచి చిన్న మంటపై ఒక 10 నిమిషాల పాటు వేయించాలి.ఆ తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే దాకా కాల్చుకోవాలి. ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే దుక్క రొట్టె తయారవుతుంది.ఇక దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: