పిల్లలు ఎల్లప్పుడూ చాలా బలంగా, పుష్టిగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. కానీ పిల్లలు మాత్రం అస్సలు సరిగ్గా తినరు. కొంత మంది పిల్లలు ఎంత తిన్నా కూడా అసలు వెయిట్ ఉండరు. మరికొందరు అయితే చాలా నీరసంగా, బలహీనంగా ఉంటారు.అయితే అలాంటి వారికి ఈ టేస్టీ అండ్ హెల్దీ అండ్ వెయిట్ గ్రెయిన్ ఫుడ్ ఇస్తే చాలా ఈజీగా వెయిట్ పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని ప్రతి రోజు స్నాక్ రూపంలో కూడా పిల్లలకు ఇవ్వొచ్చు. దీన్ని ప్రతి రోజూ ఒక్క బౌల్ తింటే పిల్లలు బలంగా ఇంకా దృఢంగా తయారవుతారు.ఇంకా అలాగే వారికి మంచి ఇమ్యూనిటీ కూడా అందుతుంది. దీంతో వారికి రోగాలతో పోరాడే శక్తి కూడా ఈజీగా లభిస్తుంది. మరి ఇక ఈ వెయిల్ గ్రెయిన్ ఫుడ్  ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా ఒక ఆపిల్ ని తీసుకొని దానికి ఉన్న చెక్కు తీసేసి కట్ చేసుకుని ఓ గిన్నెలోకి వేసుకోవాలి. తరువాత బాదం పప్పులను కూడా కట్ చేసి ఆపిల్ వేసిన బౌల్ లో వేయాలి. తరువాత ఈ రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి, ఓ పది నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి. ఇక ఆ తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఆపిల్ ముక్కలు బాగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. తరువాత ఇందులోకి బాగా పండిన అరటి పండు, ఒక స్పూన్ నెయ్యి ఇంకా అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ తిప్పుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్ లో తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వెయిల్ గ్రెయిన్ ఫుడ్ రెడీ అయిపోతుంది. దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్ లాగా పిల్లలకు ఇవ్వొచ్చు. సంవత్సరం పిల్లలకు అయితే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ లా కూడా ఇవ్వొచ్చు.దీన్ని అలవాటు చేస్తే పిల్లలు చాలా బలంగా ఇంకా పుష్టిగా సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: