తొడ  కండరాలు  పట్టేస్తుంటే ఇలా చెయ్యండి ?

వయస్సు మీద పడడం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండడం, వ్యాయామం చేస్తున్నప్పుడు ఇంకా క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల కూడా తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటాయి.ఇక అలాంటి సమయాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది.అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కానీ  కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మీకు తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత దాకా ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.అలాగే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. 


దీంతో బిగుసుకుపోయిన తొడ కండరాలు ఈజీగా సాగుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది.అలాగే కొబ్బరినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. తరువాత దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు.చాలా మందికి కూడా డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. అయితే నీరు తగినంతగా తాగకపోతే ఇలా జరుగుతుంది. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు బాగా పట్టేస్తాయి. అలాంటప్పుడు తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.అలాగే శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా కూడా ఇలా జరుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు వంటి ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: