సాధారణంగా మన అందం ఒక చిరునవ్వుపైన ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు.అటువంటి అందాన్ని మరి ఇంత పెంచే భాగాలలో పళ్ళు కూడా ఒక భాగమని చెప్పవచ్చు.మనం చిరునవ్వు చిందించినప్పుడు మన పళ్ళు తెల్లగా మిలమిలా మెరుస్తూ అందంగా ఉంటేనే,మన మొహం కూడా అందంగా ఉంటుంది.కానీ ఈ మధ్యకాలంలో చాలామందికి వారు తినే ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణంగా పళ్లు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి.అందులో ముఖ్యంగా పళ్ళు పుచ్చిపోవడం,పళ్ళు గార పట్టడం,పసుపు పచ్చగా మారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి మన టూత్ పేస్ట్ ఎంత వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించదు.కానీ పూర్వం రోజుల్లో మన పెద్దలు పాటించే కొన్ని రకాల చిట్కాలతో మన పళ్ళను ఈజీగా మెరిపించుకోవచ్చు అని చెబుతున్నారు ఆయుర్వేదనిపుణులు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

ఉప్పు..

 ఉప్పు సాధారణంగా క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.కావున పంటి సమస్యలతో బాధపడేవారు చిటికెడు ఉప్పు తీసుకొని,పళ్ళపై మెల్లగా బ్రష్ చేసుకోవడం వల్ల,పళ్ళపై ఎటువంటి బ్యాక్టీరియా ఉన్న నశించిపోయి,పళ్ళ సమస్యలు ఈజీగా తొలగిపోతాయి. మరియు పళ్ళు కూడా మిలమిలా మెరుస్తాయి. ఉప్పును రుద్దేటప్పుడు మెల్లగా రుద్దుకోవాలి లేదంటే, పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.అందువలన కొబ్బరి నూనెతో పళ్ళను శుభ్రం చేసుకోవడంతో చెడు బ్యాక్టీరియా నశించిపోయి,పళ్ళ ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీనిని ఉపయోగించేటప్పుడు ఒక స్పూన్ మోతాదులో కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని,పుక్కలించి ఆ తర్వాత బ్రష్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది.

యాపిల్ సిడర్ వినిగర్..

దీనికోసం యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి పుక్కిలించాలి.దీనితో దంతాలపై ఉన్న మరకలు ఈజీగా శుభ్రం అవుతాయి.కానీ దీనికి యాసిడ్ స్వభావం అధికం,దీనిని నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్‌ దెబ్బతింటుంది.అందుకే దాన్ని నీటిలో కలిపి వాడాలి.

సోడా పొడి..

సోడా పొడిని బ్రష్ పై చిటికెడు వేసి పళ్ళపై మెల్లగా రుద్దడంతో,పళ్ళపై ఉన్న ఎటువంటి మరకలనైనా ఈజీగా తొలగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: