
ఉబ్బరం ఉన్నవారు కూడా పుచ్చకాయని అసలు తినకూడదు. బరువు తగ్గాలనుకునే వారు కూడా పుచ్చకాయని తినకుండా ఉండడం మంచిది. ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను అసలు తినకూడదు. పుచ్చకాయలు చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు పుచ్చకాయను తినకపోవడం మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డాక్టర్లను సంప్రదించి పుచ్చకాయను తినండి. పుచ్చకాయ సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచుతుంది. సంబంధిత సమస్యలు బాధపడేవారు పుచ్చకాయని అసలు తినకండి. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధులు ఉన్న వారి శరీరంలో పొటాషియం సరిగ్గా బయటపడదు, దాంతో హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వారు పుచ్చకాయ మోతాదును డాక్టర్ సూచించిన మేరకు పరిమితం చేయాలి. పుచ్చకాయ తినడం వలన మరింత పొటాషియం పెరిగి, గుండె సంబంధిత ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి పుచ్చకాయ తింటే అలర్జీ రియాక్షన్స్ రావచ్చు. పుచ్చకాయ అధికంగా తినడం వల్ల కొందరికి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. లేదా అధిక మలబద్ధకం సమస్యలు రావచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు మితంగా మాత్రమే తినాలి. పుచ్చకాయను స్వచ్ఛమైనదిగా మాత్రమే తినాలి.