
ఒక కప్పు కీర దోస మొక్కలు తీసుకుంటే శరీరానికి సరిపడా నీరు లభిస్తుంది. ఫలితంగా శరీరం డిహైడ్రేషన్ కు లోన్ అవదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థలను, విష పదార్థాలను తొలగించి... శరీరాన్ని చల్లబరుస్తాయి కూడా. కీర దోసను సలాడ్ గా తీసుకుంటే బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. దీనిలోని సిలికా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచితే, పొటాషియం రక్తపోటును నియంతరిస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అలసట, చికాకు, నిరాసక్తత నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
రోజు ఒక గ్లాస్ కిరా దోస రసం తాగితే మనసు తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. కీరా నువ్వు నీటిలో వేసుకుని కూడా తాగొచ్చు. ఆ నీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలకు అవసరమైన లవణాలను లభిస్తాయి. కాబట్టి కీర దోస ఆరోగ్యానికి చాలా మంచిది. కీర దోసకాయలు 95% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని హానికరమైన ప్రీ రాడికల్స్ తో పోరాటానికి సహాయపడతాయి. ఇది క్యాలరీలు తక్కువ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కీర దోసకాయ రక్తంలో చక్కెర స్థాయిని నియంతరించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.