టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కొన్నేళ్ల క్రితం ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలానే విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం హీరోగా మారి ఎన్నో సినిమాల్లో నటించిన మెగాస్టార్, ఆ తరువాత వచ్చిన ఖైదీ సినిమాతో హీరోగా అతి పెద్ద విజయం అందుకున్నారు. ఇక అక్కడి నుండి హీరోగా వరుస అవకాశాలు అందుకుని అనతికాలంలోనే ఎన్నో గొప్ప విజయాలతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుని తన కెరీర్ లో మొత్తంగా 150 కి పైగా సినిమాల్లో నటించి మెగాస్టార్ గా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు చిరంజీవి.  

ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కొన్నేళ్ల క్రితం హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న పవన్, అక్కడి నుండి తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకుని హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన పేరుని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కు అన్నయ్య చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం. అయితే తన క్రేజ్ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్న పవన్, తాను ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఎల్లప్పుడూ మెగాస్టార్ సోదరుడిని అనే అంటారు. అయితే మొదటి నుండి పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా ఆయనకు సంబందించిన బర్త్ డేలు, సినిమా రిలీజ్ ల విషయమై మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారని, ఇక ఇటీవల సోషల్ మీడియా మద్యమాల వినియోగం ఎక్కువైన తరువాత మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల ఫ్యాన్స్ కు ధీటుగా సోషల్ మీడియాలో పలు ట్రెండ్స్ సృష్టిస్తున్న పవన్ ఫ్యాన్స్, మరొక మూడు రోజుల్లో రానున్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా జరిగే ట్రెండ్స్ లో మాత్రం తమకు సపోర్ట్ చేయడం లేదనేది కొందరు చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తున్న వాదన.  

పవన్ కు ఎంత గొప్ప క్రేజ్ ఉన్నప్పటికీ స్వయంగా ఆయనే అన్నయ్య తరువాతే నేను అని ఎప్పుడూ చెప్తుంటే, పవన్ ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ కు సంబందించిన వేడుకల పై నిరాసక్తితో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని, ఈ విధంగా పవన్ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవికి శాపంగా మారడం సరైనది కాదని అంటూ కొందరు మెగాస్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆవేదనతో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మా మెగాహీరోల ఫ్యాన్స్ అందరం ఒక్కటే అని, ఇది కేవలం కొందరు కావాలనే చేస్తున్న తప్పుడు ఆరోపణ మాత్రమే అని అంటూ మరికొందరు మెగాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియక సాధారణ ప్రేక్షకులు తెగ ఆలోచనలు చేస్తున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: