హీరోయిన్ సంజన అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ప్రభాస్ తో కలిసి బుజ్జిగాడు, దండుపాళ్యం వంటి సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ హీరోయిన్ ని టక్కున గుర్తుపడతారు.ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే గాని సైడ్ క్యారెక్టర్లు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఈమె ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో కూడా చిక్కుకొని చాలా ఇబ్బందులు పడింది.

ఇక అంతే కాకుండా ఈమె జైలు శిక్ష కూడా అనుభవించింది. కొద్దిరోజుల్లోనే ఈమె బెయిలు మీద బయటకు వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఈమె తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నది. ఇప్పుడు ఆ విషయం కాస్త బాగా వైరల్ గా మారుతోంది. మంగళవారం రోజున ఉదయం పూట షూటింగ్ వెళ్లేందుకు ఒక క్యాబ్ బుక్ చేసుకున్న సంజన.. ఆ తర్వాత ఆమె వేరొక చోటికి వెళ్లాలని  డ్రైవర్ని కోరింది.


దాంతో ఆ డ్రైవర్ ఆమె కోరిక మేరకు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలుపగా.. వారు ఆమె మార్చుకోవలసిన లొకేషన్ ను నిరాకరించారు. ఇక నటి సంజన డ్రైవర్ను నాని బండ బూతులు తిట్టింది. అతను ఆలోచించి దయచేసి క్యాబ్ దిగి వెళ్ళిపొండి అంటూ తెలియజేశాడు. కానీ ఆమె అతని మాటలు వినకుండా అతని పై గొడవకు దిగింది. దీంతో ఆ డ్రైవర్ ఏం చేసేది లేక.. సంజన ప్రవర్తిస్తున్న నటువంటి ప్రవర్తనను ఒక వీడియోను తీసి పోలీసులను ఆశ్రయించాడు ఆ డ్రైవర్.

ఇక హీరోయిన్ సంజన మాత్రం తను నేను చెప్పిన లోకేషన్ కు తీసుకు వెళ్ళ లేదంటూ.. సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది. అంతేకాకుండా కారులో ఉండేటువంటి ఏసీ ని కొద్దిగా పెంచమని అడిగినా కూడా డ్రైవర్ దానికి నిరాకరించినట్లు గా ఆమె తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా వారు అడిగినంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారు ఇలా చేయడం సరికాదని ఆమె100 నెంబర్ కు ఫోన్ చేసి ఆ డ్రైవర్ మీద కంప్లైంట్ చేసింది. ఇక వీరిద్దరిలో ఎవరు విషయం నమ్మాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: