- క‌మ‌లాపురంలో హ్యాట్రిక్ దిశ‌గా జ‌గ‌న్ మేన‌మామ‌
- వీర‌శివారెడ్డి వైసీపీ చేరిక‌తో మ‌రింత పెరిగిన బ‌లం
- పుత్తా చైత‌న్యారెడ్డి పోటీ ఇస్తాడా.. చేతులెత్తేస్తాడా ?

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న వీర శివారెడ్డి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో మారాయి.  దీంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌మ‌లాపురంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మార్పు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. క‌మ‌లాపురంలో సీఎం జ‌గ‌న్ మేన‌మామ పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి (విజ‌య‌మ్మ త‌మ్ముడు) వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ ఈసారి అయినా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని కూట‌మి పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి.


అయితే.. వీర‌శివారెడ్డిని కాదని.. పుత్తా చైత‌న్య‌రెడ్డికి టీడీపీ ఇక్క‌డ టికెట్ ఇచ్చింది. దీంతో శివారెడ్డి ఆగ్ర‌హంతో ఉన్నారు. వాస్త‌వానికి టీడీపీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈయ‌న పార్టీలో ఉన్నారు. క‌మ‌లాపురం వంటి బ‌లమైన కాంగ్రెస్ కంచుకోట‌లో ఆయ‌న టీడీపీని డెవ‌ల‌ప్ చేశార‌నేదివాస్త‌వం. 1994, 2004లో రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత నుంచి ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గించినా.. పార్టీలోనే ఉన్నారు. కానీ, ఈ ద‌ఫా మాత్రం పోటీ త‌థ్య‌మ‌ని ప్ర‌జాగ‌ళం యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్ నుంచి హామీ తీసుకున్నారు.


తీరా టికెట్‌ల పంపకాల స‌మ‌యంలో మాత్రం ఈయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇక‌, వీర‌శివారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్న టీడీపీకి ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. పైగా బ‌ల‌మైన కంచుకోటా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న డెవ‌ల‌ప్ చేసుకున్న నేప‌థ్యంలో ఆయ‌నకు తిరుగులేద‌నే వాద‌న ఉంది. ఇప్పుడు వీర‌శివారెడ్డి కూడా వైసీపీకి క‌లిసి రావ‌డంతో.. ఈ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


ఇది వైసీపీకి ఏక‌ప‌క్షంగా విజ‌యం అందించినా ఆశ్చ‌ర్యం లేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి బ‌లమైన నాయ‌కులను వ‌దులు కోవ‌డం ద్వారా.. టీడీపీ ఓటు బ్యాంకుకు గండి ప‌డుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌చారంలో జోరుగా సాగుతున్న నేప‌థ్యంలో వీర శివారెడ్డి ద్వారా టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోతుంద‌ని.. అంచ‌నాలు వ‌స్తున్నాయి. క‌మ‌లాపురంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స‌ర్వేల్లో వైసీపీ వైపే మొగ్గు క‌నిపించింది. మ‌రి వ‌చ్చే వారంలో అయినా.. మార్పు కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: