ఎస్ ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్‌ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈ సినిమా ప్రొడ్యూసర్‌ కె.ఎల్‌.నారాయణ చెప్పిన కొన్ని మాటల వల్ల అభిమానుల ఊహలకు రెక్కలొచ్చేశాయి... ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తన పాత్రకి సంబందించిన మేకోవర్ కోసం రెడీ అవుతున్నట్టుగా చెప్పారు. అలాగే.. ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ఉంది. ఆ రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. మే 31 వ తేదీన లెజెండరి యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన రానుందనే ప్రచారం కూడా ఉంది.


ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఆగష్టు నెలలో మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ స్టార్ట్ అవడం మాత్రం గ్యారెంటి అని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దబోతున్నట్లుగా తెలుస్తోంది.సాధారణంగా మహేష్ ఏ డైరెక్టర్ తో అయినా సరే ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు. ఇక రాజమౌళి లాంటి పాన్ ఇండియా దర్శకుడితో పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇంకెంతలా వర్క్ చేస్తాడో ఊహించవచ్చు. మరి మహేష్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ ప్రాజెక్టు కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో చూడాలి. అలాగే రాజమౌళి కూడా ఫస్ట్ టైం మహేష్ లాంటి టాప్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే రాజమౌళితో ఇప్పటిదాకా పని చేసిన వారంతా కూడా రాజమౌళి సినిమా తరువాత స్టార్స్ అయ్యారు. కానీ మహేష్ బాబు ఆల్రెడీ పెద్ద సూపర్ స్టార్ కావడంతో ఆయన క్రేజ్ కి తగ్గట్టు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: