గతంలో నారాలోకేష్ కి ప్రస్తుతమున్న నారా లోకేష్ కి చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా మంగళగిరిలో పోటీ చేయడం అన్నది ఆషామాసి విషయం కాదు.. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలిచి అక్కడ కొన్ని దశాబ్దాలు కాలం అవుతోందట.. గత ఎన్నికలలో కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్.. అక్కడ విషయాలన్నీ తెలుసుకున్న సరే మరొకసారి లోకేష్ ధైర్యంగా అక్కడే మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో లోకేష్ ని చాలామంది కూడా మెచ్చుకుంటున్నారు. ఏమాత్రం అధైర్య పడకుండా తాను తీసుకొని నిర్ణయం ఇప్పుడు రాజకీయాల వేల హాట్ టాపిక్ గా మారుతున్నది.


నిజానికి లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే టిడిపి అధినేత కుమారుడు అలాగే జాతీయ రాష్ట్ర కార్యదర్శిగా కూడా లోకేష్ ముందుకు వెళ్తున్నారు.. రాబోయే రోజుల్లో టిడిపి పగ్గాలను కూడా చేపట్టే అవకాశం ఉన్నది.. ముఖ్యంగా టిడిపి గెలిచే స్థానాలు చాలానే ఉన్నాయి.. గత రికార్డులను పరిశీలిస్తే హిందూపురంలో నారాలోకేష్ నిలబడితే కచ్చితంగా బాలయ్య(మామయ్య) తప్పుకుంటారు.. అలాగే కృష్ణాలో మరో బలమైన నియోజవర్గం పెనమలూరు.. ఇవే కాకుండా అటు కుప్పం ఇతరత్రా ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా లోకేష్ ఎలాంటి పక్క చూపులు చూడకుండా తను ఓడిన చోట గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ అని తెలిసి తన ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. మంగళగిరిలో గెలిచిన తర్వాతే శాసనసభలో అడుగు పెడతానని లోకేష్ బీస్మిచ్చు కూర్చున్నారు. ఎంతోమంది నేతలు సలహాలు ఇచ్చినా కూడా తాను మాత్రం వినకుండా మంగళగిరి నుంచి పోటీ చేస్తానని తెలియజేశారు. మరొకవైపు తమ మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం ,గాజువాక ప్రాంతాలలో పోటీ చేసిన ఓడిపోయారు. దీంతో ఈసారి మళ్లీ ఓడిపోకూడదని పిఠాపురం నియోజవర్గంలోకి మారిపోయారు. అయినప్పటికీ కూడా అనుమానం చాలామంది సినీ సెలెబ్రిటీలను మెగా కుటుంబం అన్నకి సంబంధించిన వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు.కానీ లోకేష్ మాత్రం ఈ విషయంలో భయపడకుండా మంగళగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి మరి నిలబడ్డారు. ఇక్కడ వైసిపి అభ్యర్థి లావణ్య నుంచి గట్టి పోటీనే ఉంటుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి మరి. కానీ లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం అందరూ మెచ్చుకోవాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: