•విశాఖ సౌత్ లో రసవత్తర రాజకీయం
•పోటీలో కూటమి బలం Vs వ్యక్తిగత ఓటు బ్యాంకు


విశాఖ సౌత్ - ఇండియా హెరాల్డ్ : విశాఖ సౌత్ నియోజకవర్గం గ్రేటర్‌ విశాఖలో చాలా స్పెషల్. ఎందుకంటే గ్రేట్‌గా చెప్పుకునే ప్రాంతాలన్నీ ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి.ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు ఉన్న విశాఖ దక్షిణలో తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్‌ బరిలోకి దిగారు.వీరు ఇద్దరు కూడా సొంత పార్టీలను వీడి కొత్త పార్టీల్లో చేరి ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలవడం విశేషం. వీరి బలాలు, బలహీనతలు గురించి తెలుసుకుందాం..



ముందుగా వాసుపల్లి గణేశ్‌కుమార్‌ విషయానికి వస్తే.. ఆయన బలం ఏంటంటే..  బాగా చదువుకొని స్థిరపడ్డారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ ఆఫీసర్‌గా పనిచేసి 1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ అనే విద్య సంస్థను ప్రారంభించి, మంచి విద్యావేత్తగా రాణించారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన గణేశ్‌కుమార్‌ను 2009 వ సంవత్సరంలో  ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వాసుపల్లి… 2014 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు. ఇక 2019లో కూడా రెండోసారి గెలిచి సత్తా చాటుకున్నారు. వృత్తిరీత్యా డిఫెన్స్‌ సర్వీసులో పని చేయడం వల్ల వాసుపల్లి వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉన్న పొలిటీషియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు పేదలు, అభాగ్యులకు ఆర్థిక సహయం చేస్తూ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు బాగా పెంచుకున్నారు. ఇక బలహీనత విషయానికి వస్తే.. విభేదాల వల్ల గణేశ్‌కుమార్‌ రెండోసారి ఎమ్మెల్యే అయిన కొద్దికాలానికే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన గ్రూప్‌వార్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అదే కొంచెం ఈయనకి బలహీనతగా మారింది.


ఇక వంశీకృష్ణయాదవ్ విషయానికి వస్తే.. రెండుసార్లు టీడీపీ గెలిచిన విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఈ సారి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించాకా ఆ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణయాదవ్ కి ఛాన్స్ ఇచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ  పీఆర్‌పీ నుంచి మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈ సారి  వైసీపీని వీడి  జనసేనలో చేరడం… విశాఖ దక్షిణ నుంచి టికెట్‌ దక్కించుకోవడం  జరిగిపోయింది. అయితే వంశీకృష్ణ కన్నా ముందు జనసేనలో చేరిన కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజు వంటివారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అందువల్ల సొంత పార్టీలో కొంచెం వ్యతిరేకత ఉంది.కానీ పవన్ అండ, కూటమి ఓట్ల బలంతో ఈ సారి ఎమ్మెల్యేగా గెలవడం పక్కా అంటున్నారు వంశీకృష్ణయాదవ్‌.


మొత్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తలపడుతున్న వీరిద్దరూ సొంత పార్టీలో క్యాడర్‌ను దారికి తెచ్చుకోవడానికి ఎక్కువగా కష్టపడ్డారు. ఇక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు బలమైన సామాజికవర్గ నేపథ్యం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకుంటుండగా, తూర్పు నుంచి దక్షిణకు వలస వచ్చిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ మాత్రం పూర్తిగా కూటమి ఓటు బ్యాంకుపైనే ఆధారపడుతున్నారు.వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: