రెబల్ స్టార్ ప్రభాస్ కొంతకాలం క్రితం "సలార్ పార్ట్ 1" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతిబాబు , పృధ్విరాజ్ సుకుమరన్ , శ్రేయ రెడ్డి , బాబీ సింహ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదే స్థాయి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత కొంతకాలానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లితెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేసింది.

ఇక ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. అలా అనుకున్న వారందరికీ ఈ మూవీ "టి ఆర్ పి" రేటింగ్ షాక్ ను ఇచ్చింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 6.5 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉన్న ప్రభాస్ హీరోగా నటించడం , ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించడం ఈ కారణాల వల్ల ఈ సినిమాకు భారీ "టి ఆర్ పి" రేటింగ్ మొదటి సారి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఈ మూవీ మాత్రం చాలా తక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను మొదటి సారి తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: