ఆంధ్రప్రదేశ్ లో మరో 9 రోజులలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే అధికార ప్రతి పక్ష పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించి. తమ అభ్యర్థులతో జోరుగా ప్రచారం చేస్తున్నాయి.. అయితే తాజాగా రాష్ట్రంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పై తీవ్ర రచ్చ రచ్చ జరుగుతుంది. వైసీపీ కొత్తగా తెచ్చే ఈ చట్టం ద్వారా పేద ప్రజల భూములపై సర్వ హక్కులు ప్రభుత్వానికి వుంటాయని. ఈ విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని టీడీపీ బాగా ప్రచారం చేస్తుంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని   యాక్ట్ రద్దు మీదే రెండో సంతకం పెడతామని ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి  ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు.

తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు.. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని . ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.అధికారంలోకి రావాలి అనుకునే వారు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు.14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని సజ్జల విమర్శించారు.భూ అక్రమాలకు  చెక్ పెట్టేందుకే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చినట్లు ఆయన వివరించారు.. అయితే అది ఇంకా గెజిట్ అవ్వలేదు.. చట్టం అమలు కాలేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు అప్పుడే మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.ఎన్నికల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని సజ్జల తెలిపారు..ఇలాంటి చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు అని ఆయన అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ అని విమర్శించారు.


టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు. వెబ్ ల్యాండ్ పోర్టల్‎లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులలోకి నెట్టివేశారని.CRDA పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. అలాగే  అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కున్నారని సజ్జల ఆరోపించారు..అలాగే పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశామని ఆయన తెలిపారు...పాస్ పుస్తకాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉంటే మీకు వచ్చిన నష్టం ఎంటని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా అని సజ్జల ప్రశ్నించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: